Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

బాప్ రే.. కుక్కకు రూ.20 కోట్లా?

  • హైదరాబాద్ ఈవెంట్ కు అత్యంత ఖరీదైన శునకం
  • కాకసియన్ షెఫర్డ్ జాతికి చెందినదని ఓనర్ వెల్లడి
  • మియాపూర్ పెట్ క్లినిక్ వద్ద సెల్ఫీల కోసం ఎగబడ్డ డాగ్ లవర్స్

ఇంట్లో ముద్దుగా పెంచుకునే శునకం ఖరీదు వేలల్లో ఉంటుంది.. విదేశాలకు చెందిన బ్రీడ్ అయితే లక్షలు వెచ్చించాల్సిందే. వేలు, లక్షలు మాత్రమే కాదు, కోట్లు విలువ చేసే శునకాలు ఉంటాయంటే నమ్మశక్యం కాదు. అయితే, అత్యంత అరుదైన కాకసియన్ షెఫర్డ్ జాతికి చెందిన ఓ కుక్క ఖరీదు రూ.20 కోట్లని ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీశ్ చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన సతీశ్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. నగరంలో శనివారం జరిగిన ఓ ఈవెంట్ లో తన శునకంతో పార్టిసిపేట్ చేశారు. ఈ కుక్కను రష్యా నుంచి కొనుగోలు చేశానని, ఇందుకు రూ. 20 కోట్లు వెచ్చించానని చెప్పారు.

కాకసియన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకానికి కాడాబామ్ హైడర్ గా సతీశ్ నామకరణం చేశారు. ఈవెంట్ లో పాల్గొనే ముందు హెల్త్ చెకప్ కోసం మియాపూర్ లోని పెట్ క్లినిక్ కు తీసుకొచ్చారు. ఈ అరుదైన శునకం రాక గురించి ముందే సమాచారం ఉండడంతో పెట్ క్లినిక్ కు డాగ్ లవర్స్ పోటెత్తారు. ఈ శునకంతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కాగా, కాడాబామ్ హైడర్ వయసు మూడేళ్లని సతీశ్ చెప్పారు. దీనిని పోషించడానికి లక్షల్లో ఖర్చవుతుందని, రోజుకు మూడు కిలోల చికెన్ తింటుందని వివరించారు. హైడర్ పలు సినిమాల్లో నటించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరిగిన షోలలో పాల్గొందని సతీశ్ తెలిపారు.

Related posts

బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయం: కోల్‌కతాలోని ఆసుపత్రి ప్రకటన!

Ram Narayana

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు పద్మవిభూషణ్

Ram Narayana

ఛత్తీస్ ఘడ్ ఎన్కౌంటర్ భూటకం …సి.పి. ఐ (యం. ఎల్) రెడ్ స్టార్

Ram Narayana

Leave a Comment