Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కమ్మకులం తలవంచుకునే పనిచేయను …భద్రాచలంలో మంత్రి తుమ్మల

కమ్మకులం తలవంచుకునే పనిచేయను …భద్రాచలంలో మంత్రి తుమ్మల
కమ్మ జాతి చరిత్ర గర్వ కారణం
పౌరుషం దాతృత్వం కలిగిన కమ్మ జాతి
గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తా…
.

కమ్మకులం తలవంచుకునే పనిచేయనని , జాతికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగానే తన అడుగులు ఉంటాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు …ఆదివారం భద్రాచలంలో కమ్మసేవ సమితి ఆధ్వరంలో నిర్మించిన వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు ..ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కమ్మ జాతి చరిత్ర గర్వకారణమని ,పౌరుషం , దాతృత్వం కలిగిన జాతిగా కమ్మ జాతికి గుర్తింపు ఉందని దాన్ని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు …

ఈరోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామ కమ్మవారి సేవా సమితి వసతి గృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు … కమ్మ జాతి దేశం అభివృద్ధి కోసం కృషి ఎంతో ఉందని అన్నారు … కమ్మ జాతి కి ఎవ్వరి దయ దాక్షిణ్యాలు అవసరం లేదన్నారు …తల వంచే జాతి కాదు…నేల ను నమ్ముకున్న జాతి కమ్మ జాతి….ఏ రంగం లో చూసినా కమ్మ జాతి ఇతర కులాల అభివ్రుద్ది లో కూడా ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు …తాను కూడా కమ్మ కులం తల వంచే పని చేయనని సభికుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు …తనకు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో మంత్రి పదవి దక్కింది…శ్రీ రాముడు నడయాడిన పుణ్య భూమి అభివ్రుద్ది కి నా జీవితం అంకితం…ఉగాది నాటికి రెండో వారధి పూర్తి చేస్తాం…నా రాజకీయ లక్ష్యం గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేస్తానన్నారు …ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వర రావు,ఏలూరి శ్రీనివాసరావు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు రసూల్,పంచాక్షరి,రామారావు,జగదీష్ గారితో పాటు కమ్మ సంఘం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related posts

నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం-అన్నా అంటే అండగా నిలుస్తా మంత్రి పొంగులేటి!

Ram Narayana

డిసెంబరు 13 నుంచి భద్రాద్రిలో శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు

Ram Narayana

సండ్ర విజయాన్ని కాంక్షిస్తూ కల్లూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ…

Ram Narayana

Leave a Comment