నకిలీ విత్తనాల సరఫరా చేస్తే కఠిన చర్యలు …వ్యవసాయమంత్రి తుమ్మల
విత్తన సరఫరా సకాలంలో జరిగేట్లు చూడాలి
విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ ,జౌళిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు …మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి రాష్ట్రంలో రైతులకు విత్తన సరఫరాలో తీసుకోవాల్సిన చర్యలను గురించి మంత్రి అధికారులతో సమీక్షా నిర్వహించారు … ఈసందర్భంగా మంత్రి మాట్లడుతూ దేశానికి అన్నం పెట్టె రైతున్నలకు సరైన మార్గదర్శనాలు అందజేయకలిగితే బంగారాన్ని పండించే శక్తి ఉన్నవారు మనరైతులను అన్నారు …రైతులకు వ్యాపారాలు తమ లాభాలకోసం కల్తీలు సరఫరా చేస్తే అది అరిష్టమన్నారు..రైతులకు ఎంతమేలు మనం చేయకలిగితే అంత దేశ ,రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన వారమవుతామని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు …
వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత & జౌళి మాత్యులు గారు విత్తన సరఫరా మరియు విత్తన రంగ అభివృద్ధి పై రాష్ట్ర సచివాలయంలో ఉన్నత అధికారులు మరియు విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ, విత్తన ధ్రువీకరణ సంస్థ మరియు విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసమావేశంలో పాల్గొన్నారు . వచ్చే సీజన్ లో రోజుల్లో రైతులకు విత్తన సరఫరా మరియు నాణ్యమైన విత్తన లభ్యత (ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న) పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా, రైతులకు విత్తన లభ్యతలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికారులను మరియు విత్తన కంపెనీలను ఆదేశించారు.
విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు అధికా ప్రాధాన్యత ఇచ్చి, మిగతా విత్తనాలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు సూచించారు.అదేవిధంగా, రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.నకిలీ విత్తనాల వలన రైతులకు ఏదైనా నష్టం జరిగితే విత్తన కంపెనీలు తగిన నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలీ సూచించారు. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందాని తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు ఇతర ఉన్నతధికారులు పాల్గొన్నారు ..