Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

యాక్సిడెంట్ లో బంధువు చనిపోయిన స్పాట్ కు వెళుతుండగా ప్రమాదం.. నలుగురి దుర్మరణం

  • నల్గొండ జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన ఆటో
  • ఆసుపత్రిలో చావుబతుకుల్లో మరో ముగ్గురు
  • రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం
Four died another three seriously injured in Lorry Tanker hit Tata Ace In Nalgonda

రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుడు చనిపోయాడని తెలిసి ఆటోలో బయలుదేరిన కుటుంబ సభ్యులు కూడా ప్రమాదానికి గురయ్యారు. రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా.. చావుబతుకుల్లో ఉన్న మరో ముగ్గురిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుందీ విషాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు (28) ఆదివారం రాత్రి మిర్యాలగూడ నుంచి పెద్దవూరకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిమ్మనూరులోని వేంపాడు దగ్గర్లో సైదులు అనే పెద్దాయనను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సైదులు, కేశవులు ఇద్దరూ చనిపోయారు. కేశవులు మృతి వార్త తెలిసి ఆయన కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ప్రమాదం జరిగిన చోటుకు టాటా ఏస్ వాహనంలో కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు బయలుదేరారు.

ఇంకో ఐదు పది నిమిషాలు ప్రయాణిస్తే ఘటనా స్థలికి చేరుకుంటామనగా.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వీరి టాటా ఏస్ ను ఢీ కొట్టింది. దీంతో కేశవులు కుటుంబ సభ్యులు రమావత్ గన్యా (40), నాగరాజు (28), పాండ్య (40), బుజ్జి (38) స్పాట్ లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని పోలీసులు మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు.

Related posts

నైజీరియాలో పెను విషాదం… పడవ బోల్తా పడి 100 మంది గల్లంతు!

Ram Narayana

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. శిక్షణ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్ మృతి!

Ram Narayana

పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు .. తల్లి, ఇద్దరు కుమారుల మృతి

Ram Narayana

Leave a Comment