ఖమ్మంలో మంత్రి తుమ్మలకు అభినందనల వెల్లువ
కోలాహలంగా మారిన వీడియోస్ కాలనీలోని తుమ్మల క్యాంపు కార్యాలయం ..
మంత్రి తుమ్మలను శాలువాలు బొకేలతో ముంచెత్తిన అభిమానులు
ఖమ్మంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశీనులైన తుమ్మల
శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన పండితులు
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ యస్ కు చెందిన మంత్రి అజయ్ పై ఘన విజయం సాధించిన సీనియర్ రాజకీయ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మొదటి సారిగా వీడియోస్ కాలనీలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టారు …ఈసందర్భంగా పార్టీ కార్యకర్తలు ,తన అభిమానులు ,జిల్లా కాంగ్రెస్ మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులతోపాటు ఎంపీపీలు, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, తోపాటు తుమ్మలగారి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి తుమ్మల శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. వివిధ సంఘాలు వర్గాలకు చెందిన ప్రజల రాకతో మంత్రి క్యాంపు కార్యాలయం కోలాహలంగా మారింది ..వ్యవసాయ, సహకార , చేనేత, జౌళి , శాఖల మంత్రిగా భాద్యతా స్వీకరించిన అనంతరం కార్యాలయానికి వచ్చిన మంత్రిని అభిమానులు శాలువాలు బొకేలతో ముంచెత్తారు … వేలాదిగా ఆయన్ను అభినందించేందుకు అభిమానులు తరలి రావడంతో ఒక సందర్భంలో వేదికపై తోపులాట జరిగింది…జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వళ్ళ దుర్గాప్రసాద్, ప్రవేట్ పాఠశాలల యజమానులు , అధికారులు , జర్నలిస్టులు , కార్పొరేటర్లు, వివిధ సంఘాల నేతలు ,తుమ్మలను కలిసి అభినందనలు తెలిపారు … ఆయన సుమారు మూడు గంటలపాటు వేదికపై చిరునవ్వుతో అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కృతఙ్ఞతలు తెలిపారు … తుమ్మల క్యాంపు కార్యాలయం లోపల చుట్టుపక్కల ఆయన కట్ అవుట్లతో నిండిపోయింది …వచ్చిన వారందరికీ తేనేటి విందు ఏర్పాటు చేశారు …కార్యక్రమాన్ని నాయకులూ సాధు రమేష్ రెడ్డి , కామార్తపు మురళి , తుమ్మల యుగంధర్ , సైదాబాబు , చావా నారాయణరావు , తదితరులు పర్వవేక్షించారు …
తొలుత కార్యాలయం లో పూజలు ….
మంత్రిగా తుమ్మల ఖమ్మంలోని వీడియోస్ కాలనీలోని తన అధికారిక క్యాంపు కార్యాలయానికి లో పూజలు నిర్వహించిన మంత్రి పండితుల అశ్విర్వచనాలు తీసుకున్నారు … ఈసందర్భంగా తుమ్మల గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వం లో సోనియాగాంధీ ఆశీస్సులతో సుపరిపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది
ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు ..ప్రశాంతమైన ప్రగతిశీల ఖమ్మం అభివ్రుద్ది చేస్తాం…ఖమ్మం నియోజకవర్గం లో నన్ను గెలిపించిన ప్రజలకు నమస్కరిస్తూన్నా అని అన్నారు….అంతకు ముందు రోటరీ నగర్ లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని , ఎన్ ఎస్పీ లోని రామాలయంలో మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు నిర్వహించారు ….
క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు తుమ్మల ,పొంగులేటి ….
క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని, ఖమ్మం పట్టణ చర్చి కాంపౌండ్ సెంటర్ లోని CSI చర్చిలో ఈరోజు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,తుమ్మల పాల్గొన్నారు .వారికీ మతపెద్దలు స్వాగతం పలికి అశ్విర్వచనాలు అందించారు … ప్రార్థన కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ ఏసుప్రభు చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో సాదు రమేష్ రెడ్డి కమర్తపు మురళి,కామ అశోక్,మందడపు మనోహర్, తుంపాల కృష్ణమోహన్, ఖాదర్ బాబా, గజ్జల వెంకన్న,దొడ్డ నగేష్, బాణాల లక్ష్మణ్, వడ్డబోయిన నరసింహారావు, శ్రీనివాసరావు, దుంపల రవి, ఇమామ్ తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీకి పోటీచేసిన తుమ్మల వెంట మొదటగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , కార్పొరేటర్లు కమర్తపు మురళి , చావనారాయణ రావు దంపతులు , సైదాబాబు దంపతులు , పోట్ల వీరేందర్ లు నడిచారు ….ఎన్ని కష్టాలు ఎదురైనా తమ ప్రయాణం తుమ్మల వెంటే అని చెప్పినవారిని గుర్తు పెట్టుకున్నమంత్రి తుమ్మల వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి తనకు వెన్నుదన్నుగా ఉండి తన ఘనవిజయంలో పాలుపంచుకున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు …అన్ని వేళల వారికీ తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు .మంత్రి అయిన తుమ్మల వారి ఇళ్లకు రావడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు …