Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సింగరేణి ఎన్నికల్లోను ఐ ఎన్ టి యూ సి ని గెలిపించండి …మంత్రి పొంగులేటి

సింగరేణి ఎన్నికల్లో ఐ ఎన్ టి యూ సి ని గెలిపించాలని రాష్ట్ర రెవిన్యూ ,గ్రహనిర్మాణం , సమాచారశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు …సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో తమ సంఘాన్ని గెలిపిస్తే కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు …కార్మికులు ఎంతోకాలంగా సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారు …వారి కలలను నిజం చేస్తాం …వారికీ స్థలం ఇవ్వడంతోపాటు ,ఇంటినిర్మాణానికి బ్యాంకుల ద్వారా 20 లక్షల రూపాయాలు ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తామని అన్నారు …సోమవారం భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బొగ్గుగనుల ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యేలతో నాయకులతో కలిసి కార్మికవాడల్లో , బొగ్గుబావులదగ్గర కార్మికుల సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు …

సింగరేణి వ్యాప్తంగా… ఒక్కచోట మినహా అన్నిచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయాన్నీ పొంగులేటి గుర్తు చేశారు … కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ ఉందని దాన్ని కొనసాగించేందుకు కార్మికులు ఐ ఎన్ టి యూ సి ని గెలిపించాలన్నారు ….2017 నుండి సింగరేణి కార్మికుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నదన్నారు …గతంలోనే జరగాల్సిన ఎన్నికలను గత ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపలేదన్నారు …గత ప్రభుత్వంలో అనేక అవకతవకలతో కార్మికులను పట్టించుకోలేదన్నారు … గత ప్రభుత్వం మాటలు మీతో పాటు నేను కూడా నమ్మి మోస పోయానని మీరు మాత్రం నమ్మవద్దని అన్నారు … కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి లో ఉన్నాను… మీ సమస్యల పరిష్కారానికి సీఎం పక్కన కూర్చోనైనా సంతకం పెట్టిస్తానని కార్మికుల హర్షద్వానాల మధ్య అన్నారు …గత ఐదు సంవత్సరాలలో సింగరేణి గనులు కనుమరుగై కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చిన గుర్తు చేశారు …మా మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాల కల్పనలో సింగరేణి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని తెలిపారు …ఇల్లందులో జేకే ఓ సి విస్తరణ లో ఇక్కడ కార్మికులు బదిలీ కాకుండా… ఇంకొక మైనింగ్ ఫిట్3 తో కార్మికులు ఇక్కడే విధుల్లో ఉండేలా చూస్తామన్నారు …కార్మికుల సొంతింటి కల కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని కృషిచేసిన గత ప్రభుత్వం సహకరించలేదన్నారు … కార్మికులకు వైద్యం కోసం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు …కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వ హయాంలో పరిష్కరిస్తామని అన్నారు …పోరాటాలు చేశాం …అని చెప్పుకొనే కార్మిక సంఘాలు ఇంకా ఉండవన్నారు…20 సంలు ప్రభుత్వంలో కి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే…కారుణ్య నియామకాలు కోసం కార్మికులు లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేది… ఇకనుంచి ఒక్క రుపాయి ఖర్చు పెట్ట కుండ కారుణ్య నియామకాలు చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు …ఆయా కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు కోరం కనకయ్య , పార్టీ నాయకులూ , కార్మిక సంఘనాయకులు పాల్గొన్నారు…

Related posts

త్వరలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు …రెవెన్యూ మంత్రి పొంగులేటి

Ram Narayana

భట్టి పీపుల్స్ మార్చ్ ఖమ్మం నగరంలోకి గ్రాండ్ ఎంట్రీ …ప్రజల బ్రహ్మరథం…

Drukpadam

బీజేపీలో కీలక పరిణామాలు.. బండి సంజయ్ అసంతృప్తి

Drukpadam

Leave a Comment