Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

  • జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం
  • సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
  • ఈ సదస్సుకు అమిత్ షా సహా కేంద్రమంత్రులను ఆహ్వానించినట్లు చెప్పిన పాల్
Praja Shanti Party chief KA Paul meets CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం కలిశారు. ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని సీఎంను కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంతో భేటీ అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ… సదస్సు నిర్వహణకు అనుమతిచ్చే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించామన్నారు. వివిధ దేశాల నుంచి వేలమంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు.

Related posts

మరోసారి పట్టాభి అరెస్ట్ పై పుకార్ల- క్షేమంగానే ఉన్నాడన్న టీడీపీ

Drukpadam

గుంటూరు-కృష్ణా జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత

Drukpadam

కృష్ణయ్య హత్యను ఖండిస్తున్నాం …సీపీఎం

Drukpadam

Leave a Comment