Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర కేసీఆర్ జైలుకు వెళ్లకతప్పదు …బండి సంజయ్

సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర కేసీఆర్ జైలుకు వెళ్లకతప్పదు :
-18 మంది టీఆర్ఎస్ నేతల అవినీతి వివరాలు సేకరించాం
-అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వ‌చ్చింది
-రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన నడుస్తోందన్న సంజయ్
-టీఆర్ఎస్ పై పోరాటానికి ఉద్యమకారులు కలసి రావాలి
-వారం రోజుల్లో ఈటల బీజేపీలో చేరుతారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేస్తున్న కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు . తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా అమ‌ర‌వీరుల‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైద‌రాబాద్‌లోని గ‌న్‌పార్క్ వ‌ద్ద‌ నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… తెలంగాణ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి టీఆర్‌ఎస్ పార్టీని సమాధి చేస్తామని అన్నారు. బీజేపీపై ఇతర పార్టీలు చేసే విమర్శలను తాము అసలు పట్టించుకోబోమని అన్నారు. అవినీతికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని… 18 మంది టీఆర్ఎస్ ముఖ్య నేతల అవినీతి వివరాలను సేకరించామని… వాటి గురించి ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని చెప్పారు. సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర గురించి కూడా వివరాలను తీసుకున్నామని తెలిపారు. కేసీఆర్ కేసుల గురించి గత వారం రోజులుగా ఆరా తీస్తున్నామని చెప్పారు. ఈ కుంభకోణాల వివరాల గురించి తెలుసుకున్న తర్వాత భయానకమైన విషయాలు తెలుసుకున్నామని కేసీఆర్ ఎంత అవినీతిపరుడో అర్థమైనదని అందువల్ల కేసీఆర్ అవినీతిపై బీజేపీ తప్పకుండ పోరాడుతున్నదన్నారు. రాష్ట్రంలో టీఆర్ యస్ కు తామే ప్రత్యాన్మయం అని ఆయన ఉద్ఘాటించారు 2023 ఎన్నికల్లో బీజేపీ జెండా తెలంగాణ లో ఎగరడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి ,నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడాకలిగే సత్తా ఒక్క బీజేపీకే ఉందని ప్రజలు భావిస్తున్నారని సంజయ్ అన్నారు. అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ మరో వారం రోజుల్లో బీజేపీలో చేరుతారని సంజయ్ తెలిపారు. ఎలాంటి హామీలు లేకుండానే ఆయన బీజేపీలోకి వస్తున్నారని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ పాలన నచ్చే ఆయన బీజేపీలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, కేసీఆర్ ను వ్యతిరేకించేవారికి బీజేపీ మంచి వేదిక అని చెప్పారు. కేసీఆర్ ను వ్యతిరేకించేవారి తరపున బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు.

టీఆర్ఎస్ పై పోరాటానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలు, ఉద్యమకారులు త‌మతో కలసి రావాలని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగల ఫలితంగానే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర క‌ల సాకార‌మైంద‌ని చెప్పారు. తెలంగాణ‌ ఏర్పాటులో త‌మ పార్టీ, దివంగ‌త‌ సుష్మాస్వరాజ్ పాత్ర కీలకమని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా మూర్ఖత్వ పాలన నడుస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెలంగాణ‌ను కేసీఆర్ కుటుంబం, ఎంఐఎం కోసమే తెచ్చుకున్నారన్న చర్చ మేధావుల్లో జరుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ ఏయే హామీలు ఇచ్చారో ఇప్పుడెలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో తెలుసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌ దళితుడిని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుకుకుంటానని తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ అన్నార‌ని, ఆయ‌న ఇప్పుడు ఏం సమాధానం చెబుతార‌ని సంజయ్ నిల‌దీశారు.

Related posts

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్… టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి…?

Drukpadam

ఖబర్దార్ కేసీఆర్ నీ పతనం ప్రారంభమైంది …..బండి సంజయ్…

Drukpadam

వనమా రాఘవ మెడకు బిగుస్తున్న ఉచ్చు …పాతకేసులు తిరగదోడుతున్న వైనం!

Drukpadam

Leave a Comment