Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మార్పును కోరుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం …డిప్యూటీ సీఎం భట్టి

పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు శ్రమించారని, వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మంత్రులు తెలిపారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించిన తెలంగాణ ప్రజలకు, పార్టీ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్ సౌకర్యం విజయవంతం అయ్యిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యకర్తల కష్టంతోనే ప్రభుత్వంలోకి వచ్చామని, వారి కష్టాల్లో పాలు పంచుకొంటూ సహకారాన్ని అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులంతా ఒక్క కుటుంబంగా పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులతో పీసీసీ వారి వారి అభిప్రాయాలను తెలుసుకుంది. పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో కాంగ్రెస్​ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలని నాయకులు, కార్యకర్తలు కోరారు. పార్టీ గెలుపునకు పని చేసిన వారిందరికీ న్యాయం జరిగేట్లు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. దశాబ్ద కాలం తర్వాత రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్​కు గొప్ప అవకాశం ఇచ్చారని, మార్పును కోరుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందామని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని భట్టి సూచించారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం ఒక వైపు బలోపేతం కావాలని, మరోవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ ఫాక్ట్ వచ్చిందని, ఒక స్వాతంత్య్రం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారని భట్టి విక్రమార్క వివరించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో పార్టీ నాయకులు ఈసారి మరింత శ్రమించాలని , ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఏఐసీసీ ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలుతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోందని తెలిపారు. హైదరాబాద్‌లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని, నాయకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని పని చేయాలని సూచించారు.

Related posts

మైనంపల్లి బెదిరిస్తున్నారు.. నాపై కూడా దాడి జరుగుతుందని భయంగా ఉంది: మంత్రి మల్లారెడ్డి

Ram Narayana

 పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి కేటీఆర్.. పోయిన బలం పెంచుకునేందుకే!

Ram Narayana

బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు: పొన్నం ప్రభాకర్

Ram Narayana

Leave a Comment