Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

లోన్ యాప్స్ కేసులో ఈడీ అధికారినే ఇంటి దొంగ…

లోన్ యాప్స్ కేసులో ఈడీ అధికారినే ఇంటి దొంగ
సంచలనం సృష్టించిన లోన్ యాప్ ల కిరాతకాలు
లోన్ యాప్ సంస్థల బ్యాంకు ఖాతాల స్తంభన
ఖాతాలు తెరిపించేందుకు ఈడీ అధికారికి లంచం
బెంగళూరులో రూ.5 లక్షలు అందుకున్న ఈడీ అధికారి

కొన్నినెలల కిందట తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్స్ దురాగతాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లోన్ యాప్ సంస్థల బ్యాంకు ఖాతాలను దర్యాప్తు అధికారులు స్తంభింపజేశారు. ఆర్థికనేరాలకు సంబంధించిన విషయం కావడంతో ఈడీ కూడా దృష్టి సారించింది. అయితే, దోషులను చట్టం ముందు నిలబెట్టాల్సిన ఈడీ అధికారి ఒకరు లంచం తీసుకుని నిందితులకు సహకరించే ప్రయత్నం చేయడం నివ్వెరపరుస్తోంది.

ముంబయికి చెందిన అపోలో ఫిన్ వెస్ట్ లోన్ యాప్ సంస్థ ఎండీ నుంచి ఈడీ అధికారి లలిత్ బజార్డ్ రూ.5 లక్షలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. లోన్ యాప్ కేసులో సీసీఎస్ అధికారులు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు ఈ లంచం ఇచ్చినట్టు వెల్లడైంది. ఈడీ అధికారి లలిత్ పలు బ్యాంకులకు తప్పుడు పత్రాలు ఇచ్చి ఖాతాలు తెరిపించి, డబ్బులు విడుదల చేయించినట్టు తెలుసుకున్నారు.అసలు దొంగ ఇంటి వాడే అని తెలుసుకొని అధికారాలు నివ్వెరపోయారు .

ఈ లంచగొండి ఈడీ అధికారిపై సీసీఎస్ పోలీసులు సీబీఐకి సమాచారం అందించారు. ఈ క్రమంలో బెంగళూరులో సీబీఐ అధికారులు లలిత్ బజార్డ్ పై కేసు నమోదు చేశారు.

Related posts

కారులో తిప్పుతూ మోడల్‌పై సామూహిక అత్యాచారం!

Drukpadam

రైలు ప్రమాదం మృతుల సంఖ్య 288 కాదు.. 275…

Drukpadam

లండన్‌లో అర్ధరాత్రి భారత సంతతి మహిళ హత్య…

Ram Narayana

Leave a Comment