Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీజేపీకి జయసుధ,విక్రమ్ గౌడ్ రాజీనామాలు…

కిషన్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలు

  • లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వరుస షాకులు
  • ఇప్పటికే విక్రమ్ గౌడ్ రాజీనామా
  • జయసుధ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం

ప్రముఖ తెలుగు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కమలం పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టిక్కెట్ ఆశించి భంగపడిన విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. తాజాగా జయసుధ కూడా అదే దారిలో నడిచారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. జయసుధ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయసుధ గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ పార్టీ మేకల సారంగపాణికి టిక్కెట్‌ను కేటాయించింది.

 బీజేపీకి హైదరాబాద్ నేత విక్రమ్ గౌడ్ రాజీనామా

  • రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించిన విక్రమ్ గౌడ్
  • పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని… కొద్దిమందికే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపణ
  • పార్టీనే నమ్ముకున్న తనలాంటి వారికి అన్యాయం జరిగిందన్న విక్రమ్ గౌడ్
Vikram Goud Resigns from BJP

దివంగత ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్ నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్‌ను ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కే పార్టీ మళ్లీ టిక్కెట్ ఇచ్చింది. తాజాగా, గురువారం ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని… కొద్దిమందికే అన్ని పదవులు కట్టబెడుతున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. గ్రూపులను కాకుండా పార్టీని నమ్ముకున్న తనలాంటి వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయని… ఇప్పటికీ పార్టీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.

Related posts

ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం కరెక్ట్ అయినప్పుడు ప్రొఫెసర్ శ్రావణ్ ఎందుకు కరెక్ట్ కాదు ..కేటీఆర్

Ram Narayana

అమిత్ షా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టో వివరాలివిగో

Ram Narayana

ఉదయం 11 గంటలకు కేటీఆర్ ‘స్వేదపత్రం’ పవర్ పాయింట్ ప్రజంటేషన్

Ram Narayana

Leave a Comment