Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

న్యూస్ ఇన్ బ్రీఫ్ ……

తెలంగాణ ప్రజలకు  మంత్రి పువ్వాడ అజయ్  శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల్లో భాగంగా తొలుత తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో తెరాస పార్టీ జెండా, జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి సర్కిల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి, మయూరి సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు అధికారిక కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు.

 

 

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , మ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం , జిల్లా కలెక్టర్ RV కర్ణన్ , పోలీస్ కమీషనర్ విష్ణు యస్.వారియర్ , అదనపు డీసీపీ లు సుభాష్ చంద్రబోస్ , ఇంజారపు పూజ , ACP లు ఆంజనేయులు , రామోజీ రమేష్ , విజయ్ గారు, DM&HO మాలతి గారు, తహసీల్దార్ శైలజ , ఇన్స్పెక్టర్ లు సిబ్బంది ఉన్నారు.

 

బీవీకే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అంబులెన్స్ :ప్రారంభించిన తమ్మినేని

 

 

ఈరోజు తాజాగా వివిధ రకాల పేషెంట్లు కోసం ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేసిన బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అంబులెన్స్ ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు . స్వచ్చంద సంస్థల సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు .ఇకనుంచి అత్యవసరం కోసం ఎవరు ఫోన్ చేసినా ఉచితంగా అంబులెన్స్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది . సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు : -9573691669 ,9490098211 9866232511 నిర్వాకులు తెలిపారు

కరోణా సేవలో ఉన్న DYFI బృందానికి …తమ్మినేని అభినందనలు

 

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఖమ్మం జిల్లా కమిటి పిలుపు లో భాగంగా కరోణా పై యుద్ధం అంటూ చేస్తున్న పోరాటం అభినందనీయం అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
స్థానిక సుందరయ్య భవనం లో బీవీకే ఐసోలేషన్ సెంటర్ అంబులెన్స్ ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ గత 22రోజులుగా బీవీకే ఐసోలేషన్ సెంటర్ లో మూడు విభాగాలుగా పని చేస్తు,జిల్లా వ్యాప్తంగా కూడా సహయ కార్యక్రమాలు నిర్వహించంటం అభినందనీయమని ఆయన అన్నారు.ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు యువత ముందుండి సెవ కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ గత 22రోజులుగా కరోణా బాధితులకు సేవలు చేయడం సంతోషం గా ఉన్నదని ఆయన అన్నారు.తనతో పాటు ఈ 22 రోజుల గా పనిచేస్తున్న కార్యకర్తలందరికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా నాయకులు బండి రమేష్ గారు, డి వై ఎఫ్ ఐ జిల్లా అద్యక్షులు మద్దాల ప్రభాకర్,జిల్లా నాయకులు భూక్యా ఉపేందర్ నాయక్, పోలేపల్లి చరణ్య, సత్తెనపల్లి నరేష్, ఇంటూరి అశోక్,గుమ్మా ముత్తారావు,సారంగి పాపారావు,కనపర్తి గిరి,కూరపాటి శ్రీను,నవీన్ రావులపాటి నాగరాజు,యాటా రాజేష్, మేఘన,భట్టు రాజు,జక్కంపూడి క్రిష్ణా, తదితరులు పాల్గొన్నారు

 

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

 

ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ … జిల్లా ప్రజలకు,
పోలీస్, హోంగార్డు మరియు మినిస్ట్రీయల్ స్టాఫ్ కు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …. ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అంక్షల అమలులో ప్రతిఒక్కరూ అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని, ఇదే స్పూర్తితో భవిష్యత్తులో ఏదురైయ్యే ప్రతి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా వుండాలని అకాంక్షించారు.

లాక్ డౌన్ సడలింపులో భౌతిక దూరాన్ని పాటిస్తూ మరిన్ని జాగ్రత్తలు పాటించాలని తప్పకుండా శానిటైజర్ ఉపయోగించడం మాస్కులు ధరించి వ్యక్తిగత శుభ్రత పాటించాలని అన్నారు.
సెంకడ్ డోస్ వ్యాక్సినేషన్ సిబ్బంది పూర్తి చేసుకొని
ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకొవాలన్నారు.

విధులు నిర్వహించడం ఎంత ముఖ్యమో తమ కుటుంబ సభ్యులు కరోనా వ్యాధి బారిన పడకుండా అన్ని స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యమని అన్నారు.

 

శ్రీ కృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ అవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సతీమణి మరియు స్కూల్ చైర్ పర్సన్ హృదయ్ మినన్ పోలీస్ కమిషనర్ తో కలసి జాతీయ జెండా అవిష్కరించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో

అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ , పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో AR అడిషనల్ డీసీపీ
కుమారస్వామి , పోలీస్ శిక్షణ కేంద్రాలో డీసీపీ LC నాయక్ జెండా అవిష్కరించారు.

కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, ఎ ఎస్ పి స్నేహ మెహ్రా, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ డీసీపీ ప్రసాద్,
ఏసీపీలు అంజనేయులు, రమేష్ ,వెంకటరెడ్డి ,
ప్రసన్న కుమార్ , ఆర్ ఆసీఫ్ విజయబాబు , ఎ ఓ అక్తరునీసాబేం,
సిఐలు అంజలి,
సాంబరాజు, తుమ్మ గోపి, ఆర్ ఐ లు శ్రీనివాస్ , రవి, సాంబశివరావు, తిరుపతి పాల్గొన్నారు..

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నెరవేరని హామీలపై ఫ్లకార్డు నిరసన దీక్ష

 

బిజెపి అర్బన్ టౌన్ అధ్యక్షుడు కుమిలి శ్రీనివాసరావు

ఖమ్మం : అధికార టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఏడేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ అర్బన్ టౌన్ అధ్యక్షుడు కుమిలి శ్రీనివాసరావు గురువారం ఖమ్మం నగరంలోని స్వగృహంలో వినూత్నంగా నిరసన ప్రకటించారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తాను చేసిన హామీలను గుర్తుచేస్తూ నెరవేరని హామీలు అంటూ ఫ్లకార్డును ప్రదర్శిస్తూ నిరసన దీక్షను చేపట్టారు . దళితున్ని ముఖ్యమంత్రి చేయలే , దళితులకు 3 ఎకరాల భూమి రాలే , గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కాలే , ఇంటింటికి ఉద్యోగం , ఇంటింటికి తాగునీరు రాలేదు . రైతు రుణమాఫీ కాలే , డబుల్ బెడ్రూం ఇల్లు పూర్తికాలే అన్న వాక్యాలతో ప్లకార్డును ప్రదర్శిస్తూ కుమిలి శ్రీనివాసరావు విమర్శించారు .

 

 

ఉద్యమకారులను సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.

కరోనా బాధితులను పూర్తిగా ఆదుకోవాలి.


తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు

 

ఖమ్మం : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు బలిదానాలు సమర్పించిన ఉద్యమకారుల అభివృద్ధికి వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల సంక్షేమ ఫోరం ఖమ్మం జిల్లా చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు డిమాండ్ చేశారు . తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తోటి తెలంగాణ ఉద్యమకారులతో కలిసి గురువారం అమరవీరుల స్థూపం ఎదుట పూలమాలలు వేసి నివాళులర్పించారు . సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది తెలంగాణ ఉద్యమకారుల త్యాగలు బలిదానాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అన్నారు . అలాంటి అమరవీరులు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం కూడా ఇలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడం విచారకరమన్నారు . వారికోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు కరోనా కారణంగా మృతి చెందిన లేదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు . నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఆత్మగౌరవం ప్రధానంగా దశాబ్దాల తరబడి ఉద్యమం సాగిందని గుర్తు చేశారు . కాలేశ్వరం పెరిటా ఎక్కువ డబ్బులు తగులబెట్టారని మండిపడ్డారు . పొరుగు రాష్ట్రాలలో గ్రూపు-1 గ్రూపు-2 పోస్టులకు రెండు మూడు సార్లు నోటిఫికేషన్ జారీ చేసిన ఇక్కడ మాత్రం అతీగతీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర వ్యతిరేకులకు ఉద్యమం సందర్భంగా తీవ్రంగా విమర్శించి వ్యతిరేకించిన కేసీఆర్ నేడు అనేక కాంటాక్ట్ పనులను వారికే దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు . ఇలాంటి ఈ విధానాలవల్ల పేద మధ్యతరగతి ప్రజల తో పాటు బంగారు కలలు కన్నా ఉద్యమకారుల జీవితాలు చిన్నాభిన్నం అయి పోయాయని వారి పరిస్థితి దుర్భరంగా మారిందని వాపోయారు . సీమంధ్ర ప్రభుత్వ హయాంలో కూడా కనిపించని అరాచకం నేడు మనం కలలుగన్న తెలంగాణ లో కల్పిస్తుందని తెలిపారు . తెలంగాణ కోసం సకల జనులు ఉద్యమించి తెలంగాణను సాధిస్తే ప్రజల తెలంగాణ కాకుండా దొరల తెలంగాణ మారిందని ఆందోళన వ్యక్తం చేశారు . ప్రశ్నించిన వారిని ద్రోహులుగా చిత్రీకరించడంతో పాటు వారిని జైలుపాలు చేస్తున్నారని పేర్కొన్నారు . ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వం పనికిరాదని , ఆ విలువలను ఒక ఉద్యమకారుడిగా పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి దానిని కాల రాయడం విచారకరమన్నారు . తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని ప్రకటించడం అపహాస్యం అని ఎద్దేవా చేశారు . బంగారు తెలంగాణ తర్వాత ముందు బతుకు తెలంగాణగా తెలంగాణ ను తీర్చిదిద్దాలని హితవు పలికారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు బానోతు బద్రునాయక్ , ఎస్.కె నజీమా, సోమరాజు, తీగల రాము తదితరులు పాల్గొన్నారు.

 

తెదేపా కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

▪️అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం
▪️టీడీపీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జయశంకర్ చిత్రపటానికి, ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను, తెలుగుదేశం పార్టీ జెండాను కూరపాటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. సాధించుకున్న కలలు తెలంగాణలో అర్హులకు సంక్షేమ ఫలాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో
ఖమ్మం పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కర్ణాకర్ ,పార్లమెంట్ ప్రధాన ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాన బోయిన శ్రీనివాస్ గౌడ్, నాయకులు మీగడ రామారావు, మల్లెంపాటి అప్పారావు, మేకల సత్యవతి, మందపల్లి రజిని ,నల్లమల రంజిత్ ,ఆకారపు శ్రీనివాస్ ప్యారిస్ వెంకన్న, ఎస్ కే సైదులు రాజేశ్వరి, కృష్ణ ప్రసాద్ ,యర్నం జేమ్స్, చావా రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళి

 

నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పాలన కోసం తెలంగాణ మహోద్యమాన్ని నాలుగు కోట్ల ప్రజలు కొనసాగించాలని ఆ ఉద్యమంలో అమరత్వం చెందిన అమరవీరు లకు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మయూరి సెంటర్ లో ఇ గల అమరవీరుల స్తూపం వద్ద నాయకులు నివాళులర్పించారుఅమరవీరుల స్థూపానికి న్యూడెమోక్రసీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు,

ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన స్వయంపాలన ప్రజాస్వామిక ఆకాంక్షల ఉద్యోగాలు ఇంతవరకు అతి గతి లేకుండా పోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రజాస్వామిక విలువలతో కూడిన పాలన జరగాల్సిన చోట గడీల పాలన కొనసాగుతుందని ఆయన అన్నారు మరోసారి ప్రజాస్వామిక తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని కోరారు

ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు సి.వై పుల్లయ్య అశోక్ రామారావు శ్రీను చంటి వెంకట కృష్ణ చందు తదితరులు పాల్గొన్నారు

 

 

 

Related posts

నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం-అన్నా అంటే అండగా నిలుస్తా మంత్రి పొంగులేటి!

Ram Narayana

బీఆర్ యస్ లో పరుగులు పెడుతున్న నాయకులు…ప్రజల్లో కానరాని జోష్…

Ram Narayana

దోపిడీ లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం…కూనంనేని

Ram Narayana

Leave a Comment