Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఇకనుంచి ప్రజలు తప్పు చేశారని అనవద్దు …కేటీఆర్

ప్రజలు తప్పు చేశారనడం సరికాదు.. ఇక నుంచి బీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడవద్దు: కేటీఆర్ హితబోధ

  • భువనగిరి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్
  • అదే ప్రజలు మనల్ని రెండుసార్లు గెలిపించారని గుర్తుంచుకోవాలని హితవు
  • ప్రజలు మన పార్టీని కూడా పూర్తిగా తిరస్కరించలేదని వ్యాఖ్య

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారనడం సరికాదని… ఇక నుంచి బీఆర్ఎస్ నేతలు అలాంటి మాటలు మాట్లాడవద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో భువనగిరి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారని ఆ పార్టీ నేతలు వివిధ సందర్భాలలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక నుంచి మన నాయకులు ఎవరూ అలా మాట్లాడవద్దని సూచించారు. 

తెలంగాణ వచ్చాక రెండుసార్లు మనల్ని గెలిపించింది అదే ప్రజలు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు మన పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి, మనకు ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమే అన్నారు. పద్నాలుగు చోట్ల అతి స్వల్ప తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.

Related posts

మా ప్రచార ‘కారు’ను తీసుకెళ్లడం అప్రజాస్వామికం: కాంగ్రెస్

Ram Narayana

ఏప్రిల్ 6 లేదా 7 తేదీల్లో తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర …సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

ఎంపీపై దాడితో చిల్లర రాజకీయమా?: కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

Ram Narayana

Leave a Comment