Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

2020 ప్రపంచాన్ని వణికించిన కరోనా

2020 ప్రపంచాన్ని వణికించిన కరోనా
ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం
ఉద్యోగాలు కోల్పోయిన యువత
స్వస్థలాలకు వలస కూలీలు
పేద ధనిక తేడాలేదు
రాజులైన సేవకులైన ఒక్కటే
2020 చేదు మిగిల్చింది ….. కరోనా అనే భయంకరమైన వైరస్ ప్రపంచాన్ని వణికించింది ….. ఆర్ధిక వ్యవస్తను చిన్నాభిన్నం చేసింది . కర్ఫ్యూ లు ,లాక్ డౌన్లు ,వ్యాపారులు తమ వ్యాపారాలను మూసివేశారు . అనేక పరిశ్రమలు మూతపడ్డాయి . కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు . కోట్లాది మంది యువత ఉద్యోగాలు కోల్పోయారు . కూలీలు తమ పనులను పోగొట్టుకొన్నారు . బతికి ఉంటె బలుసాకు తింటాం అనే రీతిలో వలస కూలీలు సొంత ఊళ్లకు చేరుకున్నారు . అనేక ఆశలూ, ఆకాంక్షలు అటుకెక్కాయి . కోట్లు సంపాదించటం అటుంచి బతికితే చాలానే అభిప్రాయం బలపడింది . రాజు , పేద తేడా లేకుండా చేసింది . డబ్బులు ఉన్న రోగం నయం చేసే నాధుడు కరువైయ్యాడు . ఈ వ్యాధి సోకె నాటికే ఇతర జబ్బులు ఉంటె మరింత ప్రమాదకరంగా మారి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రపంచ వ్యాపితంగా ఎనిమిదిన్నర కోట్ల మంది కరోనా భారిన పడగా పద్దెనిమిది లక్షలకు పైగా మృత్యు వాత పడ్డారు . శాస్త్ర పరంగా ఎంతో అభివృద్ధి చెందాం అని చెబుతున్న అమెరికా, రష్యా , బ్రెజిల్ , ఫ్రాన్స్ , బ్రిటన్ , ఇటలీ , స్పెయిన్ , జర్మనీ , లాంటి దేశాలు సైతం ఈ మహమ్మారికి తల్లడిల్లి పోయాయి . ఒక్క అమెరికా లోనే ఇప్పటికి సుమారు 2 కోట్ల మంది కరోనా భారిన పడ్డారని అంచనా . ఇందులో సుమారు 3 లక్షల 50 వేల మందికి పైగా చనిపోయారు . ఇంతటి విపత్తు ఈమధ్య కాలంలో జరగలేదనే అభిప్రాయాలూ ఉన్నాయి . 1918 -19 ప్లేగు వ్యాధి వలన ఒక్క అమెరికాలోనే 6 లక్షల 75 వేల మంది చనిపోయారు . అనేక దేశాలలో ప్లేగు వలన కోట్లలో మరణాలు సంభవించాయి . కరోనా పై సంవత్సరం పైగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తయారు కోసం అనేక దేశాలలో ప్రయోగాలు జరిగాయి . వ్యాక్సిన్ వచ్చింది అని అంటున్నారు . కొన్ని దేశాలలో వ్యాక్సిన్ వేయటం కూడా ప్రారంభించారు . అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలు అనే తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలను ఈ మహమ్మారి తాకింది . సుమారు 220 చిన్నాపెద్దా దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది . ఇది చైనా నుంచి వచ్చిందని ఆదేశమే దీన్ని తయారు చేసిందని అమెరికా ఆరోపణలు చేస్తుంది . ప్రపంచాన్ని ఆర్ధిక, అంగ బలంతో శాసిస్తున్న దేశాలు కరోనా ముందు తలవంచాయి . అణుబాంబులు అటుకెక్కాయి . మిలటరీ విలవిలా లాడింది . సైన్యం ,చేతులెత్తేసింది . బ్రిటిష్ ప్రధాని బోరిస్ జూన్సన్ అమెరికా అధ్యక్షడు ట్రాంప్ , ఇటలీ ,భారత్ తో సహా అనేక మంది దేశాధి నేతలను ఈ మహమ్మారి వదిలిపెట్టలేదు . అనేక మంది ప్రముఖులు చనిపోయారు .
ఈ వ్యాధి దరిచేరకుండా ఉండాలంటే మనిషి ,మనిషి కి మధ్య దూరంగా ఉండటం , మాస్క్ ధరించిటం, చేతులను శానిటైజ్ చేసుకోవటమే ఏకైక పరిస్కారం మార్గమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు .
ఇప్పటికే వచ్చిన వ్యాక్సిన్ వేయటం ప్రారంభమైంది . మారి కొన్ని దేశాలలో ఇంకా ప్రారంభం కావాల్సివుంది . చేదును మిగిల్చి మానవ జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా 2021 తరిమి కొట్టేందుకు జరుగుతున్నా ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆశిద్దాం ……

Related posts

ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌లు.. సోనూసూద్ ఇళ్ల‌పై మ‌ళ్లీ ఐటీ దాడులు…

Drukpadam

శారదా పీఠానికి ఇచ్చిన భూమి వెనక్కి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

Ram Narayana

వంగవీటి రాధా రాజకీయ అడుగులు ఎటువైపు …?

Ram Narayana

Leave a Comment