Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జనసేనలోకి ముద్రగడ.. స్వయంగా ఆహ్వానించనున్న పవన్ కల్యాణ్

  • ముద్రగడ నివాసానికి వెళ్లిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్
  • మిమ్మల్ని ఆహ్వానించేందుకు పవన్ వస్తున్నారని చెప్పిన బొలిశెట్టి
  • ఈ నెల 20 లేదా 23న ముద్రగడను పవన్ కలిసే అవకాశం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. ఈరోజు ముద్రగడను జనసేన నేతలు నేరుగా కలిశారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్లారు. పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానించేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా వస్తున్నారని ఆయనకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా వైసీపీలోకి తాను వెళ్లే ప్రసక్తే లేదని ముద్రగడ మరోసారి స్పష్టం చేశారు. 

ఈ నెల 20 లేదా 23న ముద్రగడను పవన్ కలుస్తున్నట్టు సమాచారం. ముద్రగడకు కాకినాడ ఎంపీగా, ఆయన కుమారుడికి పెద్దాపురం లేదా ప్రత్తిపాడు సీటును కేటాయించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ… జనసేనలో చేరేందుకు ముద్రగడ సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. 

Related posts

ప్రశాంత్ కిషోర్ పై వైపీసీ సంచలన వ్యాఖ్యలు …

Ram Narayana

ఏపీ మంత్రి సురేశ్ సతీమణిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు…

Ram Narayana

జనసేన అధినేతపవన్ కల్యాణ్ కు స్వల్ప అస్వస్థత

Ram Narayana

Leave a Comment