Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మానవత్వం చాటిన జైపూర్ పోలీసులు….

మానవత్వం చాటిన జైపూర్ పోలీసులు.

సొమ్మసిల్లి పడిపోయిన మహిళకు నీరు అందించి, టిఫిన్ ఇచ్చి, దారి ఖర్చులకు 500 రూపాయలు ఇచ్చి ఆటోలో ఇంటికి చేర్చిన జైపూర్ SI రామకృష్ణ…

రామగుండం కమిషనరేట్ జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం క్రాస్ రోడ్ వద్ద గోదావరిఖనికి వెళ్లడానికి ఆటో గురించి చూస్తూ కళ్ళు తిరిగి ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోగా అక్కడే విధులు నిర్వహిస్తున్న జైపూర్ ఎస్సై రామకృష్ణ, గన్ మెన్ సుబ్బారావు వెంటనే గమనించి ఆ మహిళ దగ్గరకు చేరుకుని ఆమెకు తన వాహనంలోని నీళ్లు తాగించగా ఆమె తేరుకోగా అసలు ఏం జరిగిందని ఆ మహిళను అడుగగా తన పేరు బండి శ్యామల w/o రాజ్ కుమార్(late), వయస్సు 35 సం॥లు నివాసం రాంనగర్, గోదావరిఖని అని, తన భర్త గత సంవత్సరం చనిపోగా కూలిపని చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నానని ఈరోజు కూడా కూలి పని గురించి పోతుండగా ఇలా జరిగిందని రాత్రి అన్నం తినకపోవడం వల్ల బాగా ఆకలిగా ఉందని చెప్పగా వెంటనే స్పందించిన జైపూర్ ఎస్సై రామకృష్ణ టిఫిన్ తెప్పించి, ఆమె ఖర్చులకు 500 రూపాయలు చేతికి అందించి వెంటనే ఒక ఆటోను అరేంజ్ చేసి తన నివాసమైన గోదావరిఖనికి పంపించడం జరిగింది.

Related posts

రవాణా రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి …మంత్రి అజయ్!

Drukpadam

సెన్సార్ బోర్డు మెంబర్ గా ఖమ్మం కు చెందిన సన్నే ఉదయ్ ప్రతాప్…

Drukpadam

ఫుల్లుగా మందుకొట్టి విమానం ఎక్కిన యువతి.. జార్జియా అనుకుని ఇండియాకు!

Ram Narayana

Leave a Comment