ఏపీలో ఒకేసారి 15 .60 లక్షల ఇళ్ల భారీ పథకాన్నిప్రారంభించనున్న సీఎం జగన్
-నేడు వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతొ పథకం
-15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
-వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న జగన్
-రాష్ట్రంలో స్థలం ఉండీ ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారు 4.33 లక్షల మంది
-340 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం
-రూ. 28,084 కోట్ల నిధుల మంజూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది.ఇంతటి భారీ ఇళ్ల నిర్మాణ పథకం బహుశా దేశంలోనే ఎక్కడ ప్రారంభం కాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుంది. స్థలం ఉండీ కట్టుకోలేని వారికి అందుకయ్యే ఖర్చును తన వాటా కింద భరిస్తుంది. రాష్ట్రంలో ఇలాంటి వారు 4.33 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో భాగంగా నిర్మించే ఇళ్లు 340 చదరపు అడుగుల్లో ఉంటాయి.