Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఆ ఇద్దరూ ఒకరు కాదు… మెహుల్ చోక్సి భార్య ప్రీతి స్పష్టీకరణ…

ఆ ఇద్దరూ ఒకరు కాదు… మెహుల్ చోక్సి భార్య స్పష్టీకరణ…
-ఆమె నా భర్త గాళ్ ఫ్రెండ్ కాదు:ప్రీతి
-గాళ్ ఫ్రెండ్ వార్తలపై స్పందించిన చోక్సీ భార్య ప్రీతి
-భారత్‌కు సజీవంగా రప్పించాలనుకున్నప్పుడు హింసించడం ఎందుకని ప్రశ్న
చొక్సిని జైలులో హింసించడం మానవహక్కుల ఉల్లంఘనేనని ఆవేదన

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో విదేశాలకు చెక్కేసి ఇటీవల డొమినాకాలో పట్టుబడిన మెహుల్ చోక్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చోక్సీ తన గాళ్‌ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తూ డొమినికాలో చిక్కినట్టు వార్తలు వచ్చాయి. అంటిగ్వా ప్రధాని కూడా ఇదే విషయం చెప్పారు. తాజాగా, ఈ వార్తలపై చోక్సీ భార్య ప్రీతి చోక్సీ స్పందించారు. ఆమె తన భర్తకు తెలిసిన వ్యక్తే తప్ప గాళ్ ఫ్రెండ్ కాదని స్పష్టం చేశారు. చోక్సీ అంటిగ్వాలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి వాకింగ్ చేసేదని చెప్పారు. మీడియాలో చూపిస్తున్న మహిళ, తన భర్తతో వాకింగ్ చేసే మహిళ ఒకరు కాదని పేర్కొన్నారు.

డొమినాకా జైలులో ఉన్న చోక్సీని హింసిస్తున్నారంటూ వస్తున్న వార్తలపైనా ప్రీతి స్పందించారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనేనన్నారు. ఆయనను సజీవంగా భారత్‌కు రప్పించాలనుకున్నప్పుడు ఇలా హింసించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. తన భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఇలా హింసించడం తగదని అన్నారు. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు.

Related posts

ఉప్పల్ టీఆర్ యస్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు … ఖండించిన ఎమ్మెల్యే…

Drukpadam

తీహార్ జైలు నుంచి సీక్రెట్ ఆఫీస్ నడుపుతున్న యూనిటెక్ వ్యవస్థాపకులు!

Drukpadam

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్లదాడి.. కారు ధ్వంసం!

Drukpadam

Leave a Comment