Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల చుట్టూ తెలంగాణ రాజకీయం …శంషాబాద్ లో అభిమానుల హడావుడి…

ఈటల చుట్టూ తెలంగాణ రాజకీయం …శంషాబాద్ లో అభిమానుల హడావుడి
– నినాదాల‌తో స్వాగ‌తం ప‌లికిన అభిమానులు…
-ఢిల్లీలో ప‌లువురు బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చించిన ఈట‌ల‌
-రేపు ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న మాజీ మంత్రి
-ఈ నెల 8 లేదా 9 బీజేపీలో చేరే అవకాశం
-ఎమ్మెల్యే పదవికి రేపు రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్!
-రేపు భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన
-ఈటల సహా బీజేపీలోకి పలువురు ముఖ్య నేతలు

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ విమాశ్రయానికి చేరుకున్న ఈటలకు అభిమానులు స్వాగతంతో హడావుడి చేశారు. ఈటల జిందాబాద్ , ఈటల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు. ఆయనకు అక్కడే పూలమాలలు వేసి ,శాలువాలు కప్పారు. ఆయన బీజేపీ లో చేరికతో పాటు, వెంట ఎవరెవరు బీజేపీలోకి వెళతారు అనేదానిపై టీఆర్ యస్ ఆరా తీస్తుంది. ఇట్లను కలిసే వారిపై గట్టి నిఘా పెట్టిన టీఆర్ యస్ సాధ్యమైనంతవరకు టీఆర్ యస్ నుంచి ఎవరిని ఈటలతో పోకుండా కట్టడి చేయాలనే ఎత్తులు వేస్తుంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డతోపాటు పలువురు ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఆయ‌న‌ హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డ‌ ఈటలకు ఆయ‌న అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారులు ఘనస్వాగతం పలికారు. ఈట‌ల రాజేంద‌ర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు.రేపు ఈట‌ల మీడియా స‌మావేశం నిర్వ‌హించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈట‌ల బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెల 8 లేదా 9న ఆయ‌న బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు ప‌లువురు నేత‌లు బీజేపీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.
బీజేపీ లో చేరికకు ముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుకు అనుగుణంగానే ఆయన శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనంతరం 8 లేదంటే 9వ తేదీల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.

బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి చర్చించారు. తనతోపాటు కాషాయ కండువా కప్పుకోబోతున్న ఏనుగు రవీందర్‌రెడ్డి.. తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో నిన్న సాయంత్రం భేటీ అయ్యారు.

ముందు ఎమ్మెల్యే పదవికి, ఆ తర్వాత టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా చేస్తారని, ఆ తర్వాత మంచి రోజు చూసుకుని బీజేపీలో చేరనున్నారు . ఈ విషయాన్ని రాజేందర్ స్వయంగా చెప్పినట్టు తన అనుయాయిలకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం . ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి సహా మొత్తం ఐదుగురు నేతలు కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నా మరికొందరు నేతలు కూడా బీజేపీ లో చేరనున్నారని తెలుస్తుంది.

Related posts

ఉచిత విద్యుత్ పై బీఆర్ యస్ ది గోబెల్స్ ప్రచారం …సీఎల్పీ నేత భట్టి

Drukpadam

లఖింపూర్ ఖేరీ హింసలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం!

Drukpadam

పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లకు వ్య‌తిరేకంగా  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు …

Drukpadam

Leave a Comment