Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదు: బొత్స

మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదు: బొత్స
  • తాడేపల్లిలో మీడియా సమావేశం
  • ఇప్పటికే మూడు రాజధానులపై చట్టం చేశామన్న బొత్స
  • ఏ నిమిషానైనా చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడి
  • రాజ్యాంగం ప్రకారమే వెళుతున్నామని స్పష్టీకరణ

ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ… అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళుతోందని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడం తథ్యమని చెప్పారు. 3 రాజధానుల అంశంలో వెనక్కి తగ్గేదే లేదని బొత్స స్పష్టం చేశారు.

మూడు రాజధానులపై రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని, అది ఏ నిమిషాన అయినా అమలు కావొచ్చని అన్నారు. ఓ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పనిచేయవచ్చని తెలిపారు. కోర్టులో ఉన్న కేసులకు, ముఖ్యమంత్రి పనిచేయడానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోర్టుల్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బొత్స వివరించారు.

Related posts

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కెనడా ప్రధానిపై రాళ్ల దాడి!

Drukpadam

కేజ్రీవాల్ పార్టీ నుండి కాంగ్రెస్‌కు ఊహించని ఆఫర్!

Drukpadam

శ్రీలంకలో కనిపిస్తే కాల్చివేత …సైన్యానికి పూర్తీ అధికారాలు తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే!

Drukpadam

Leave a Comment