Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

 వైసీపీకి షాక్.. ఎంపీ పదవికి, పార్టీకి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా

  • నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ భావిస్తోందన్న లావు
  • 20 రోజులుగా నియోజకవర్గంలో అనిశ్చితి నెలకొందని వ్యాఖ్య
  • క్యాడర్ కూడా గందరగోళానికి గురవుతున్నారన్న లావు
  • ప్రస్తుత పరిస్థితుల కారణంగానే రాజీనామా చేశానని వెల్లడి
  • ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఇవ్వని క్లారిటీ

ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. లోక్ సభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. 

శ్రీకృష్ణ దేవరాయలును నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. రాజీనామా చేసిన సందర్భంగా లావు మాట్లాడుతూ… పార్టీలో గత 15, 20 రోజులుగా అనిశ్చితి నెలకొందని చెప్పారు. అనిశ్చితికి తెర పడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు. అనిశ్చితికి తాను కారణం కాదని, ఈ అనిశ్చితిని తాను కోరుకోలేదని అన్నారు. ఈ అనిశ్చితి వల్ల తనకు కానీ, పార్టీకి కానీ ఉపయోగం లేదని చెప్పారు. క్యాడర్ కూడా ఏ డైరెక్షన్ లో వెళ్లాలనే గందరగోళంలో ఉన్నారని తెలిపారు. దీనికి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తాను రాజీనామా చేశానని చెప్పారు. 

గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని తెలిపారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు. దీని వల్ల అందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని తెలిపారు. దీనికి తెరదించుతూ.. తాను ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తనను ప్రోత్సహించి ఎంపీ టికెట్ ఇచ్చారని… ఆయన ఆకాంక్షల మేరకు తాను పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచానని తెలిపారు. ఎంపీ అంటే ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి కనిపిస్తాడనే భావనను తాను తొలగించానని… ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలా అండగా ఉన్నానని తెలిపారు.

Related posts

ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

సిట్ కార్యాలయానికి లోకేశ్, భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ

Ram Narayana

చంద్రబాబుకు ఇచ్చింది బెయిల్ మాత్రమే: సజ్జల

Ram Narayana

Leave a Comment