తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… వీడియో ఇదిగో

  • సీఎంను కలిసిన సునితా, కొత్త ప్రభాకర్, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు
  • ముఖ్యమంత్రి నివాసంలో కలిసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
  • మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. తమ తమ నియోజకవర్గాలలోని సమస్యను వారు ముఖ్యమంత్రికి విన్నవించారని తెలుస్తోంది.

Related posts

తెలంగాణ కేసీఆర్ వల్లే రాలేదు.. ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి.. ‘దేవుడే నన్ను పంపాడు’ అంటూ భావోద్వేగం…

Ram Narayana

రేపటి నుంచి రేవంత్ జిల్లాల పర్యటన..

Ram Narayana