Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తా: లాస్య నందిత సోద‌రి నివేదిత

  • ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య‌ నందిత మృతి 
  • తనను నిలబడమని ప్రజలు కోరుతున్నారన్న నివేదిత ‌
  • త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుస్తానని నివేదిత వెల్ల‌డి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య‌ నందిత ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యం. ఇక ఈ స్థానంలో జ‌రిగే ఉప ఎన్నిక‌లో పోటీ చేసే విష‌య‌మై దివంగ‌త ఎమ్మెల్యే లాస్య నందిత సోద‌రి నివేదిత శ‌నివారం క్లారిటీ ఇచ్చారు. 

నివేదిత మాట్లాడుతూ.. “నాన్న సాయ‌న్న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన కంటోన్మెంట్‌ నియోజ‌క‌వ‌ర్గ‌ ప్ర‌జ‌లు లాస్య నందితను సైతం గెలిపించారు. అయితే, దుర‌దృష్ట‌వ‌శాత్తు రోడ్డు ప్ర‌మాదంలో మ‌న యువ నేత‌ను కోల్పోవ‌డం జ‌రిగింది. ఇప్పుడు ఉప ఎన్నిక‌లో నిలబడమని స్థానిక నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు నన్ను కోరుతున్నారు. వారి కోరిక మేర‌కు నేను ఈ బైపోల్‌లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఈ విష‌య‌మై త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుస్తాను” అని ఆమె తెలిపారు.

Related posts

ముఖ్యమంత్రి ప్రకటన రేపటికి వాయిదా… డీకే శివకుమార్‌కి ఢిల్లీకి పిలుపు

Ram Narayana

 ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కోదండరాంను ఎలా ఆమోదించారు?: గవర్నర్‌కు కేటీఆర్ ప్రశ్న

Ram Narayana

తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి: తంగళ్లపల్లి ప్రజలతో కేటీఆర్…

Ram Narayana

Leave a Comment