Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

దేహాలు ముక్కలైనా దేశం కోసం పని చేసింది గాంధీ కుటుంబం: మంత్రి సీతక్క

  • భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్‌ను ఆదరించాలని విజ్ఞప్తి 
  • అన్ని పెండింగ్ పనులను తాము పూర్తి చేస్తామని హామీ
  • ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగంలో ఉంచుతామన్న మంత్రి

దేహాలు ముక్కలైనా… దేశం కోసం పని చేసింది గాంధీ కుటుంబం మాత్రమేనని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆమె మాట్లాడుతూ… భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్‌ను ఆదరించాలన్నారు. అన్ని పెండింగ్ పనులను తాము పూర్తి చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. బీజేపీ మతాల గురించి మాట్లాడటం తప్ప చేసిన పనులు ఎప్పుడూ చెప్పదని విమర్శించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్‌కు వచ్చి ఏం ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. మూతపడ్డ సీసీఐ పరిశ్రమ గురించి ఆయన మాట్లాడలేదని విమర్శించారు. విద్య మీద, బట్టల మీద 12 శాతం ట్యాక్స్ వేశారన్నారు. పేదలను మరింత పేదలను చేసింది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. ప్రజలు తలుచుకుంటే ఎవ్వరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారని హెచ్చరించారు. బీజేపీకి జంతువుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదన్నారు. చచ్చిన శవాలకు బీజేపీ ట్యాక్స్ వసూలు చేస్తోందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పిన తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి కూడా చెప్పాలన్నారు.

Related posts

బీఆర్ఎస్ నేతల కోసమే నిర్మల్ మాస్టర్ ప్లాన్… రద్దు చేయకపోతే నిరసనలే: ఈటల

Ram Narayana

కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ విశ్వసించదన్న మంత్రి కేటీఆర్

Ram Narayana

గాంధీ కుటుంబం మాట ఇస్తే నెరవేర్చి తీరుతుంది: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment