ఐ పి యస్ అధికారి రూప కు 20 ఏళ్ళు సర్వీస్ 40 బదిలీలు
నీతినిజాయతీలకు దేశంలో తావులేదని మరోసారి రుజుయైంది . కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐ పి యస్ అధికారి రూప తన 20 సంవత్సరాల సర్వీసులో 40 సార్లు బదిలీకావటం ఒక రికార్డ్ గా మిగిలింది . బదిలీలకు ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంటే ఏమిలేదు . ఆమె ముక్కుసూటి తనమే కారణం . కర్ణాటక రాష్ట్రము లోని దేవనగిరి లో జన్మించిన రూప 2000 సంవత్సరంలో యూ పి యస్ సి పరీక్షలు క్లియర్ చేశారు . ఆమెకు ఆలిండియా 43 వ రాంక్ వచ్చింది . రెండు సార్లు రాష్ట్ర పతి పథకం కూడా అందుకున్నారు . తాజాగా కర్ణాటక రాష్ట్ర మహిళా హోమ్ సెక్రటరీ గా పని చేస్తున్న ఆమెను హ్యాండ్ క్రాఫ్ట్ డవలప్ మెంటు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీచేశారు . గతంలో ఆమె బెంగుళూరులోని జైల్లో శశికళ ఉండగా అందుకు కొందరు వి ఐ పి ట్రీట్ మెంటు ఇవ్వడంపై అభ్యతరం వ్యక్తం చేశారు . ఒక మంత్రి తాను చెప్పిన విధంగా చేయలేదనే కోపంతో బదిలీ చేయించారు . ఒక పోలీస్ అధికారి తనకు అడ్డు వస్తున్నదని ఆమెను బదిలీ చేయించారు . ఇలా ఆమె బదిలీలు అన్ని గమ్మత్తు గా జరిగాయి . అయినప్పటికీ ఆమె ఎప్పుడు బదిలీలకు అదరలేదు , బెదరలేదు . ఇవి తమ ఉద్యోగంలో భాగమేనని భావిస్తారు . భాద్యతగా మెలగాలికాని ఎవరికీ భయపడాల్సిన పనిలేదని అంటారు ఆమె . బదిలీ అనేది ఉద్యోగంలో భాగం . అందువల్ల పెట్టేబేడా సర్దుకొని ఉండాలి ఎక్కడికంటే అక్కడికి వెళ్లేందుకు అనేది ఆమె అభిప్రాయం . తాజా బదిలీకి కారణం బెంగుళూరు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ టెండరింగ్ విషయంలో అక్రమమైనా పనులు చేయాలనీ పై అధికారి చెప్పటం అందుకు ఆమె నిరాకరించటంతో బదిలీవేటు తప్పలేదు . ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను కానీ వంకర దారుల్లో వెళ్లేదిలేదని ఆమె తేల్చి చెప్పటం విశేషం . అందుకే ఆమె పలువురి ప్రసంశలు అందుకున్న , రెండు సార్లు రాష్ట్రపతి మెడల్స్ వచ్చిన ఆమెకు కష్టాలు తప్పటం లేదు . నిజాయతీకి బహుమానం వదిలీలే అంటున్నారు కర్ణాటక రాజకీయ నాయకులూ , ఆమె పై అధికారులు .
previous post
next post