Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

బీఆర్ యస్ లో పరుగులు పెడుతున్న నాయకులు…ప్రజల్లో కానరాని జోష్…

ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో బీఆర్ యస్ నేతలు పరుగులు పెడుతున్నా …ప్రజల్లో జోష్ మాత్రం కనిపించడంలేదు …ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆపార్టీ బలహీనపడింది ..పైగా కాళేశ్వరం నిధుల దుర్వినియోగం , అవినీతి , లిక్కర్ స్కాం లో కేసీఆర్ కూతురు కవిత జైలు పాలు కావడం ,అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి బీజేపీలోకి జంప్ కావడం లాంటి సమస్యలు వెంటాడుతున్నాయి….బీఆర్ యస్ బలహీనపడిందని , ఇంకా పడుతుందని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది … నేతలు ఎంత కష్టపడ్డా ఓటర్ల నుంచి స్పందన కరువైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…

కాంగ్రెస్ పార్టీకి ఈనాలుగు నెలల కాలంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అది తమకు కలిసి వస్తుందని బీఆర్ యస్ నేతలు నమ్ముతున్నారు …కానీ పరిస్థితులు ఆవిధంగా లేవనేది వారు గ్రహించగలిగితే కొన్ని ఓట్లు పెంచుకోవచ్చు…బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నామ నాగేశ్వరరావు అంటే నియోజకవర్గంలో తెలియని వారు లేరు … వివాదాలకు దూరంగా ఉండే స్వభావం ..లోకసభలో కూడా తన గళాన్ని గట్టిగ వినిపించిన నేత …టీడీపీ లో ఉన్నప్పుడు , బీఆర్ యస్ నుంచి లోకసభకు ఎన్నికైన నామకు రెండు సార్లు పార్టీకి లోకసభలో పక్ష నాయకుడుగా వ్యవహరించే అరుదైన అవకాశం లభించింది …దీంతో ప్రధాని ,కేంద్రమంత్రులు , దేశంలోని పెద్ద నాయకుల అందరితో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి…మంచి పార్లమెంటేరిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు …అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన నిలిచారు …ఖమ్మం నుంచి ఇప్పటివరకు ఎన్నికైన సభ్యుల అందరిలోకి ఎక్కువసార్లు సభలో మాట్లాడిన నేతగా రికార్డులకు వెక్కారు… ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న నామ, 18 వ లోకసభలో అడుగు పెట్టేందుకు తిరిగి బీఆర్ యస్ తరుపున పోటీచేసి ప్రచారంలో శ్రమిస్తున్నారు …. పార్టీ పరంగానే కాకుండా ఆయనకు సొంత ఇమేజ్ కొంత ఉంది …పార్టీ పరంగా మైనస్ అయినా తన ఇమేజ్ కలిసి వస్తుందని ఆయన నమ్ముతున్నారు …

2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన నామ నాగేశ్వరరావు 49 .8 శాతం అంటే పోలైన ఓట్లలో 5 లక్షల 67 వేల 459 ఓట్లు పొందగలిగారు …ఆయన తన కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీమంత్రి రేణుక చౌదరి పై లక్షా 68 వేల 62 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు …అప్పుడు బీఆర్ యస్ అధికారంలో ఉంది …అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి కి 3 లక్షల 99 వేల 397 ఓట్లను రావడం విశేషం ….ఒక సందర్భంలో ఆమె రంగం నుంచి తప్పుకున్నారని ప్రచారం జరిగినప్పటికీ సుమారు 4 లక్షల ఓట్లు రావడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది …అంటే పైసా ఖర్చు పెట్టకుండా డబ్బులు పంచకుండా 35 శాతం ఓట్లు రావడం గమనార్హం ….ఇక సిపిఎం అభ్యర్థిగా పోటీచేసిన బి .వెంకట్ కు 57 వేల 102 ఓట్లు అంటే కేవలం 5 శాతం ఓట్లు లభించాయి….బీజేపీకి చెందిన దేవకీ వాసుదేవరావు కు 20 వేల 488 , జనసేన పార్టీ అభ్యర్థి నరాల సత్యనారాయణకు 19 వేల 315 ఓట్లు లభించాయి…మొత్తం 14 లక్షల 41 వేల 181 ఓట్లు ఉండగా 11 లక్షల 23 వేల 999 ఓట్లు పోలైయ్యాయి…

గత డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోకసభ పరిధిలో పోటీచేసిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ యస్ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడిపోయారు … ఇందులో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవగా కొత్తగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు …అక్కడ బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది …ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు రెండున్నర లక్షలకు పైగా మెజార్టీ లభించింది …కొత్తగూడం నియోజకవర్గం మెజార్టీ తీసివేసిన కాంగ్రెస్ మోజార్టీకి డోకాలేదు …

నామ గత 20 రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు …దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు పెట్టారు …నామ వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ , జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు పాల్గొంటున్నారు …ఆయన నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయినా నేతలు పాల్గొంటున్నారు …. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిన ప్రస్తుత పరిస్థితుల్లో నామ ఇమేజ్ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి…

Related posts

నామ అంటే ఒక బ్రాండ్ …నామ అంటే విలులతో కూడుకున్న రాజకీయం చేసేవాడు …

Ram Narayana

ఖమ్మంలో అట్టహాసంగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్

Ram Narayana

సీటీ స్కాన్, టిఫా సేవలు వెంటనే పునరుద్దరణ చేయాలి – CPM

Ram Narayana

Leave a Comment