Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మారిషస్ మాజీ అధ్యక్షుడు అనిరుధ్ జగన్నాథ్ కన్నుమూత

  • అనారోగ్యంతో మృతిచెందిన అనిరుధ్
  • ఆయన వయసు 91 సంవత్సరాలు
  • అనిరుధ్ తనయుడు ప్రవింద్ ప్రస్తుతం మారిషస్ ప్రధాని
  • ప్రవింద్ కు ఫోన్ చేసి పరామర్శించిన భారత ప్రధాని మోదీ

మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ కు పితృవియోగం కలిగింది. ప్రవింద్ తండ్రి, మారిషస్ మాజీ అధ్యక్షుడు అనిరుధ్ జగన్నాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అనిరుధ్ జగన్నాథ్ వయసు 91 సంవత్సరాలు. అనిరుధ్ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

పితృవియోగంతో బాధపడుతున్న మారిషస్ ప్రధాని ప్రవింద్ కు ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని గొప్ప రాజనీతిజ్ఞుల్లో అనిరుధ్ జగన్నాథ్ ఒకరని మోదీ కొనియాడారు. అనిరుధ్ జగన్నాథ్ ను భారత ప్రభుత్వం గతేడాది పద్మ విభూషణ్ తో సత్కరించింది. అనిరుధ్ జగన్నాథ్ రాజకీయ జీవితం 1963లో ప్రారంభమైంది.

Related posts

ఈసీ సంచలన నిర్ణయం… సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ పార్టీలకు జాతీయ హోదా రద్దు

Drukpadam

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు జైలు శిక్ష!

Drukpadam

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించిన టీటీడీ!

Ram Narayana

Leave a Comment