Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జనరల్ వార్తలు ...

ఏప్రిల్‌లో ఉష్ణోగ్రత 100 ఏళ్ల రికార్డు బద్దలు.. మేలో వాతావరణంపై ఆందోళన…

ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఈ రెండు నెలలు ఇతర సంవత్సరాల కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ శాఖ గతంలో కూడా చెప్పింది…వాతావరణ శాఖ అధికారులు ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఏడాది ఏడాదికి ఎండ వేడిమి, వేడి గాలుల తీవ్రత పెరిగిపోతోంది. ఉక్కబోతతో జనం అల్లాడిపోతున్నారు. ఒకలాంటి విచిత్ర వాతావరణం ఏప్రిల్ నెలలో కనిపించింది. ఈ నెలలలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 సంవత్సరాల తర్వాత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. చాలా చోట్ల ఉష్ణోగ్రత వేడి 43 డిగ్రీలకు చేరుకుంది. అంతేకాదు తాజాగా మే నెలలో వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది.

వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో 1921-2024 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు ఉన్న డేటాను పంచుకుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ నెల అత్యంత వేడి నెలగా ఉంన్నదని ఈ డేటా చూపుతోంది. ఇక మరో ఐదు రోజుల్లో ఇది మరింత వేడిగా మారనుంది. IMD ప్రకారం దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్పంలో తీవ్రమైన వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది.

మరో ఐదు రోజుల్లో విపరీతమైన వేడి..

ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు రాబోయే ఐదు రోజుల పాటు కొనసాగునున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ సమయంలో ఓటింగ్ జరగాల్సిన చోట్ల వేడి ఎక్కువగా ఉంటుంది. బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పాటు కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉంది.

ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు:

ఇంట్లోనే ఉండండి, కిటికీలు, తలుపులు మూసి ఉంచండి. వీలైనంత వరకు ప్రయాణం మానుకోండి. కాంక్రీట్ నేలపై పడుకోవద్దు. కాంక్రీట్ గోడలకు అనుకుని కుర్చుకోవద్దు. ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేసి ఉంచండి

ఎండల వేడి నేపధ్యంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, రాయలసీమ వంటి ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్ ప్రమాదం కలగనుందని రెడ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జరీ చేసింది, హిమాలయ పర్వత ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు.

Related posts

డ్రగ్స్‌కు బానిసైన కొడుకు.. కిరాయి గూండాలతో చంపించిన తండ్రి

Ram Narayana

ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో లోపాలు… వెంటనే అప్ డేట్ చేసుకోవాలన్న కేంద్రం

Ram Narayana

సినీపరిశ్రమ రాజకీయాలకు దూరం ….దగ్గుబాటి సురేష్ బాబు ….

Ram Narayana

Leave a Comment