Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషలు ఎత్తివేసే కుట్ర …సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ..

దేశంలో లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రావని అన్నారు. రిజర్వేషన్లపై గొంతెత్తి ప్రశ్నించినందుకు తనపై పగబట్టి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రే కేసు పెట్టారని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ప్రతినిధులు కాంగ్రెస్​ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీని కలిసి కులగణన చేయాలని కోరారని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ పదేళ్లు పాలనలో వందేళ్ల విధ్వసం జరిగిందని విమర్శించారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగే కాంగ్రెస్​ జనజాతర సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ మొదట రాష్ట్రంలోని కార్మికులకు సీఎం రేవంత్​ రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్‌ కార్మిక సంఘాలు సకలజనుల సమ్మె చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికలకు గత ఎన్నికల కంటే భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. రిజర్వేషన్ల రద్దుపై తాను ప్రశ్నించినందుకు తనపై మోదీ, అమిత్‌ షా పగబట్టి దిల్లీలో కేసు పెట్టారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐతోనే కాదు దిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారని వాపోయారు. బీజేపీ వద్ద సీబీఐ, ఈడీ , పోలీసులు ఉండొచ్చు కానీ తన వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. ముక్త్‌ భారత్‌ అంటే రిజర్వేషన్లు రద్దు చేయడమేనా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ దాహార్తి తీర్చేందుకు అదనంగా కృష్ణా జలాలు అడిగితే ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణను అవమానించి మళ్లీ ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని బీజేపీపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

Related posts

మన భూభాగాన్ని చైనా లాక్కుందని లడఖ్ లోని ప్రతి ఒక్కరికీ తెలుసు!: రాహుల్ గాంధీ

Ram Narayana

భారత్ గా మారనున్న ఇండియా?.. దుమారం రేపుతున్న రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక!

Ram Narayana

తన కుమారుడికి బీజేపీ టికెట్ రాకపోవడంపై మేనకాగాంధీ స్పందన

Ram Narayana

Leave a Comment