Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

అమ్మకు వందనం….

అంతర్జాతీయ మాతృదినోత్సవం: అమ్మకు వందనం చేసిన ప్రముఖులు

  • మే 12న అంతర్జాతీయ మాతృదినోత్సవం
  • సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విషెస్ వెల్లువ
  • అమ్మ విశిష్టతను వివరించిన ప్రముఖులు

ఇవాళ అంతర్జాతీయ మాతృ దినోత్సవం. సృష్టిలో అత్యంత విలువైనది అమ్మ… అటువంటి అమ్మ విశిష్టతను ప్రస్తుతిస్తూ ప్రముఖులు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సృష్టిలో… మాటల్లో చెప్పలేని… అక్షరాలతో రాయలేని… అనంతమైన అనుభూతి… ఆకాశమంత అద్భుతం అమ్మ. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

టీడీపీ అధినేత చంద్రబాబు…
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికీ వందనం. బిడ్డల భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే అమ్మలకు పాదాభివందనం.

నారా లోకేశ్ (టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి)
హ్యాపీ మదర్స్ డే అమ్మా! నీ వాత్సల్యం, నీ కరుణ, నీ బలంతో నీ చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని శక్తిమంతం చేస్తావు. నువ్వు వెలుగుతూ మా జీవితాలను వెలిగిస్తున్నావు. అద్భుతమైన అమ్మగా ఉన్నందుకు థాంక్యూ అమ్మా!

వైఎస్ షర్మిల (ఏపీ పీసీసీ చీఫ్)
అమ్మ… చీకటిలో వెలుగు రేఖై, బాధలో బలానివై, అలసటలో ఆలనవై, విజయాల్లో ఆశీర్వాదానివై, దేవుడు నాకిచ్చిన అనిర్వచనీయమైన కానుక, నా ప్రాణం, నా ప్రేరణ, అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మా!

మెగాస్టార్ చిరంజీవి…
జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మకి ఈ ఒక్క రోజు ఏంటి… ప్రతి రోజూ అమ్మదే. ఈ జీవితమే అమ్మది. హ్యాపీ మదర్స్ డే!

Related posts

అల్లు అర్జున్ విడుద‌ల ఆల‌స్యంపై.. చట్టపరమైన చర్యల యోచ‌న‌లో ఆయన తరఫు న్యాయవాదులు!

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి, తెలంగాణ నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందన

Ram Narayana

పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మోహన్ బాబు భార్య లేఖ…

Ram Narayana

Leave a Comment