Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

దేవుడు పంపిన ప్రతినిధిని అన్న మోదీ వ్యాఖ్యలకు మమతా బెనర్జీ కౌంటర్

  • బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్న మమతా బెనర్జీ
  • అందుకే వారు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శ
  • దేవుడు అలాంటి వ్యక్తులను ప్రతినిధిగా పంపించడని చురక

తాను దేవుడు పంపిన ప్రతినిధిని అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని పేరును ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధురాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ… ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయం బీజేపీ నేతలకు పట్టుకుందన్నారు. అందుకే వారు అర్థం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.

దేవుడు పంపిన వ్యక్తులమని కొందరు చెప్పుకుంటున్నారని… కానీ అలాంటి వారు అల్లర్లకకు పురికొల్పడం, ప్రకటనల ద్వారా తప్పులు ప్రచారం చేయడం, ఎన్ఆర్సీ చేపట్టి ప్రజలను జైల్లో వేయడం, పనికి ఆహారం పథకం నిధులను నిలిపివేయడం, గ్రామాల్లో ఇళ్లు నిర్మించకుండా అడ్డుకుంటారా? ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తానని హామీ ఇచ్చి తప్పడం వంటి పనులు చేస్తారా? అని ఎద్దేవా చేశారు. దేవుడు అలాంటి పనులు చేయడు (అలాంటి వ్యక్తిని దేవుడు ప్రతినిధిగా పంపించడు) అని మమతా బెనర్జీ అన్నారు.

Related posts

వారణాసిలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ …!

Ram Narayana

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్… జైలు నుంచే సీఎం పరిపాలిస్తారన్న స్పీకర్

Ram Narayana

కేటీఆర్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్‌

Ram Narayana

Leave a Comment