పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ లో ….?
వరస ఎన్నికలు కోడ్ అమలుతో పరిపాలన కు ఇబ్బందులు
కొద్దినెలల వాయిదా వేస్తె మంచిందని సలహా ఇచ్చిన అధికారులు
జూన్ ఎన్నికలు లేనట్లే అంటున్న అధికార వర్గాలు
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం జూన్ నెలలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది …అయితే వరస ఎన్నికలు కోడ్ అమలు తో పరిపాలనకు ఇబ్బందిగా మారింది …దీంతో అధికారులు ఎన్నికలు కొన్ని నెలలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు …డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు , తర్వాత మే లో పార్లమెంట్ ఎన్నికలు , తిరిగి పంచాయతీ ఎన్నికలు అంటే ఎన్నికలతోనే పుణ్యకాలం కష్టం పూర్తీ అవుతుందని దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు సూచించినట్లు సమాచారం …అందువల్ల ఎన్నికలను కొంత ఎన్నికల ఊపిరి పీల్చుకున్న తర్వాత అక్టోబర్ నెలలో పెడితే మంచిదని సలహా ఇచ్చయినట్లు తెలిసింది …అందువల్ల జూన్ నెలలో ఉంటాయనుకుంటున్న ఎన్నికలు మరికొన్ని నెలలు వాయిదా పడే అవకాశం ఉందని అధికార వర్గాల భోగట్టా….