Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

శనివారం తిరుమలలో పోటెత్తిన భక్తులు…దర్శనానికి 20 గంటలపైనే సమయం

కలియిగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం వేలాది భక్తులు తరలి వస్తున్నారు …అసలే ఎండాకాలం సెలవులు , విద్యార్థులు పరీక్షా ఫలితాల మొక్కులు వెరసి తిరుపతి కొండలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి…గత మూడు నాలుగు రోజులుగా రోజుకు 70 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు …శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శ నం కోసం గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి. నిన్న 70,668 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 38036 మంది తలనీలాలు సమర్పించారు.
నిన్న శ్రీవారి హుండీకి రూ. 3. 64 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది…శని,ఆదివారాల్లో మరింత మంది భక్తులు తిరుమల కొండకు రానున్నారని దేవాలయ అధికారులు భావిస్తున్నారు …భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు ..అన్నదానం సత్రంలో కూడా వస్తున్నా భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్నారు ..

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శనివారం, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తితిదే ప్రకటించారు. అలాగే సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోనని స్పష్టం చేసింది. ఈ మార్పును ప్రతి ఒక్కరూ గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని కోరింది. 

దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు అధికంగా తరలివస్తున్నారు. వారు స్వామివారి దర్శనానిక క్యూలైన్లలో 30 నుంచి 40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. 

సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఆయా రోజులకు సంబంధించి వీఐపీ సిఫారసు లేఖలను కూడా స్వీకరించబోమని తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది. 

Related posts

 సంక్రాంతికి టీఎస్ఆర్‌టీసీ 4,484 ప్రత్యేక బస్సులు

Ram Narayana

తీవ్రంగా కలచివేసింది: గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ లేఖ

Ram Narayana

యశోదా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు

Ram Narayana

Leave a Comment