Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైకోర్టు వార్తలు

అరుదైన ఘట్టానికి వేదికైన తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదికైంది. అర్థరాత్రి 1గంట వరకు వెకేషన్ బెంచ్ ప్రొసీడింగ్స్ సాగింది. గురువారం ఉదయం 10.30 నుంచి శుక్రవారం తెల్లవారుజామున 1గంట వరకు ఈ విచారణ సాగింది.

జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మి నారాయణతో కూడిన డివిజన్ బెంచ్ ఒక్కరోజే లిస్ట్ లో ఉన్న 250 కేసులను విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

మే6 నుంచి మే 31వ తేదీవరకు తెలంగాణ హైకోర్టుకు సెలవులు. అత్యవసర కేసుల విచారణకోసం వెకేషన్ బెంచ్ లు పనిచేస్తాయి. సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటీషన్ లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో కేసులన్నీ పూర్తయ్యే సరికి అర్థరాత్రి ఒంటిగంట దాటింది. బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో పలు సెక్షన్ల ప్రకారం ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించలేదు. వాయిదా వేసింది. ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి 1గంటకు విచారణ చేపట్టింది.

అమిత్ షా మార్ఫింగ్ కేసులో కింది కోర్టుకు విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటీషన్ పై అర్ధరాత్రి 1గంటలకు విచారించిన హైకోర్టు.. అర్ధరాత్రి ఒంటిగంటకు విచారించాల్సినంత ముఖ్యమైన విషయం కాదని వ్యాఖ్యానించింది. పిటిషన్ పై విచారణను జూన్ 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది….

Related posts

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు… వైసీపీ నేతలకు హైకోర్టులో ఎదురుదెబ్బ !

Ram Narayana

పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరంలేదన్న ఏపీ హైకోర్టు… పిటిషన్ డిస్మిస్!

Ram Narayana

హైడ్రా చీఫ్ రంగనాథ్ పై మండిపడ్డ హైకోర్టు.. అత్యుత్సాహం వద్దంటూ హెచ్చరిక

Ram Narayana

Leave a Comment