- బెయిల్ పిటిషన్లపై నిన్న వాదనలు వినిపించిన కవిత తరఫు లాయర్లు
- నేడు వాదనలు వినిపించిన దర్యాఫ్తు సంస్థలు
- బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు దర్యాఫ్తు సంస్థల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.