భానుడి ప్రతాపానికి అగ్నిగుండంగా మారిన దేశరాజధాని ఢిల్లీ
52.3 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్టోగ్రతలు …ఇది నగర చరిత్రలోనే రికార్డు
తట్టుకోలేక పోతున్న ప్రజలు …బయటకు రావద్దని అధికారుల ఆదేశాలు
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు
భానుడి వేడికి దేశంలోని ఉత్తర భారతం భగభగ మండుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఎండ వేడికి ఉడుకుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం..
భారత రాజధానిలో ఉష్ణోగ్రతలు బుధవారం రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయి. ఈ విపరీతమైన వేడి ఢిల్లీ శివారు ముంగేష్‌పూర్‌లో నమోదైంది. ఇది నగర చరిత్రలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల్ సెల్సియస్‌ను అధిగమించడం ఇదే మొదటిసారి. ముంగేష్‌పూర్‌లోని వాతావరణ కేంద్రంలో మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్, నరేలాలో 47.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో కూడా పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లలోని కొన్ని ప్రదేశాలలో హీట్ వేవ్ నుంచి తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులను ఐఎండీ అంచనా వేసింది.