Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉచిత వ్యాక్సిన్ పై పక్కరాష్ట్రాల సీఎం లు అభినందనలు -పత్తాలేని కేసీఆర్ :బండి సంజయ్

ఉచిత వ్యాక్సిన్ పై పక్కరాష్ట్రాల సీఎం లు అభినందనలు -పత్తాలేని కేసీఆర్ :బండి సంజయ్
దేశమంతా ఉచిత వ్యాక్సినేషన్ ప్రకటించిన మోదీ
కేసీఆర్ ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాలన్న బండి సంజయ్
కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు
జులై నాటికి మరో 40 లక్షల డోసులు రావొచ్చని వెల్లడి

దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల పక్క రాష్ట్రాల సీఎంలు అభినందనలు తెలుపుతుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పత్తా లేకుండా పోయారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రకటించిన ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉందని అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటే కేసీఆర్ కు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం తెలంగాణకు 80 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించిందని, జులై నాటికి మరో 40 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ప్రధాని ప్రకటనపై ప్రజలు హర్షతిరేకలు వ్యక్తం చేస్తున్నారని కానీ కేసీఆర్ కు కనీసం స్పందించాలని సోయి లేకపోడం విచారకరమన్నారు.

Related posts

అందరిని ఆకర్షిస్తున్న అమృత్సర్ తూర్పు …సిద్దు …మజీతియా పోటాపోటీ !

Drukpadam

కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన జీవీఎల్ నరసింహారావు!

Drukpadam

పొంగులేటి ,జూపల్లి నివాసాలకు కాంగ్రెస్ నేతలు రేవంత్, కోమటిరెడ్డి…

Drukpadam

Leave a Comment