Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో కీలక పరిణామం… సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి…

  • సాయంత్రం కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం
  • సెలవుపై వెళ్లిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్
  • అనారోగ్య కారణాలతో సెలవు పెట్టినట్లు వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ గురువారం ఆదేశించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లారు. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాయంత్రం కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో సెలవు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు సలహాదారులు రాజీనామాలు చేశారు. అయితే ఇప్పటి వరకు రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వైసీపీ ఓటమి అనంతరం ఏపీ అదనపు అడ్వోకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డిలు కూడా రాజీనామాలు సమర్పించారు. ప్రభుత్వసలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు.

Related posts

ఏపీలో పాఠశాలల్లో ప్రార్ధనలు రద్దు …తెలంగాణాలో బడులు తెరిచే యోచన!

Drukpadam

బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్!

Drukpadam

సరుకులు మోసుకుంటూ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన చైనా వ్యోమనౌక!

Drukpadam

Leave a Comment