Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ… సీడబ్ల్యూసీ తీర్మానం…

  • త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పినట్లు వెల్లడించిన కాంగ్రెస్ వర్గాలు
  • రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలని తామంతా కోరుకుంటున్నామని వెల్లడి
  • ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కృషిని కొనియాడిన సీడబ్ల్యూసీ

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు సీడబ్ల్యూసీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అంగీకరించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈరోజు ఢిల్లీలో సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.

సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ… రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలని తామంతా కోరుకుంటున్నామన్నారు. ఇది వర్కింగ్ కమిటీ అభ్యర్థన అన్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కృషిని కూడా సీడబ్ల్యూసీ కొనియాడినట్లు చెప్పారు.

Related posts

మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

రాముడిని తలుచుకుంటూ ప్రాణాలు విడిచిన గాంధీ అనుచరులం: ప్రియాంక గాంధీ

Ram Narayana

ముగ్గురు బీజేపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు: మమతా బెనర్జీ

Ram Narayana

Leave a Comment