Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

కెనడాలో ఇందిరాగాంధీ హత్య పోస్టర్లు.. ఖండించిన ట్రూడో ప్రభుత్వం

  • వాంకూవర్‌లో ఇందిరా గాంధీ హత్య పోస్టర్ల ఏర్పాటు
  • ఈ చర్యను ఖండించిన కెనడా మంత్రి
  • హింసను ప్రేరేపించే చర్యలను ఏమాత్రం ఆమోదించబోమని ప్రకటన
  • హిందువుల్లో భయోత్పాతం కలిగిచేందుకే ఈ చర్య అన్న చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్య

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు వాంకూవర్ నగరంలో ఇందిరా గాంధీ హత్య తాలూకు పోస్టర్లు ఏర్పాటు చేయడం కలకలానికి దారి తీసింది. ఈ చర్యలను కెనడా ప్రభుత్వం ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాంక్ స్పందించారు. ‘‘వాంకూవర్ లో కొందరు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లు ఏర్పాటు చేశారు. కెనడాలో ఇలా హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని పేర్కొన్నారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డులు కాల్చి చంపేసిన విషయం తెలిసిందే.  

ఈ ఘటనపై భారత సంతతికి చెందిన చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్యా కూడా స్పందించారు. ‘‘ వాంకూవర్ లోని ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లను ఏర్పాటు చేశారు. హిందూ కెనేడియన్లలో భయోత్పాతం కలిగించేందుకు ఈ చర్యకు పూనుకున్నారు. గత ఏడాది బ్రాంప్టన్ లో జరిగిన ఘటనల కొనసాగింపే ఈ బెదిరింపు. హిందువులు ఇండియాకు వెళ్లాలంటూ వేర్పాటువాది పన్నున్  కొన్ని నెలల క్రితం హెచ్చరించాడు. ఇలాంటి చిత్రాల ప్రదర్శన చివరకు హింసకు దారి తీసే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. సిక్కు వేర్పాటు వాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్‌కు పన్నున్ ప్రతినిధిగా, న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక సిక్కు రాష్ట్రమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థపై భారత్ నిషేధం విధించింది. 

వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులకు కెనడా అడ్డాగా మారిందని భారత ప్రభుత్వం గతంలో పలుమార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Related posts

సాంకేతిక లోపం.. సునీతా విలియమ్స్ స్పేస్ మిషన్ చివరి నిమిషంలో వాయిదా…

Ram Narayana

పారిస్ ఒలింపిక్స్ లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషుల ఆర్చరీ టీమ్..

Ram Narayana

కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలు… భారత్ తీవ్ర అభ్యంతరం.. అమెరికా దౌత్యవేత్తకు సమన్లు

Ram Narayana

Leave a Comment