Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఖమ్మంలో మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన టీయూడబ్ల్యూజే నేతలు

ఈ నెల 19, 20 తేదీలలో రెండు రోజుల పాటు ఖమ్మం పట్టణంలోని ఉషా హరి కన్వెన్షన్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) తృతీయ మహాసభ ఏర్పాట్లను సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్,
కె.విరాహత్ అలీలు శుక్రవారం నాడు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభా వేదికను, భోజన ఏర్పాట్లను, వసతి సౌకర్యాన్ని వారు పరిశీలించారు. మహాసభ ఏర్పాట్ల కోసం నియామకమైన ఆయా కమిటీలతో వారు సమావేశమై సమీక్షా జరిపారు. ఖమ్మం జిల్లా యూనిట్ టీం వర్క్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు …

అనంతరం యూనియన్ స్టిక్కర్లను ఆవిష్కరించి, మీడియా సమావేశాన్ని నిర్వహించి మహాసభ నిర్వహణ గురించి వివరించారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాంనారాయణ, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వర్ రావు, నాయకులు రవీంద్ర శేషు, వేణు గోపాల్ రావు, నర్వనేని వెంకట్రావ్, ఎన్.వెంకట్ రావు, పాపారావు, మురహరి, ఆవుల శ్రీనివాస్, సైదులు, ఖదీర్ జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్, జిల్లా నాయకులు నామ పురుషోత్తం ,శివానంద, జనార్ధన చారి, ఏలూరి వేణుగోపాల్, మేడి రమేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం- బీఆర్ఎస్ ను బొంద పెడుతాం… కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి…

Drukpadam

సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్!

Ram Narayana

సిపిఐ కొత్తగూడం గర్జన సభ గ్రాండ్ సక్సెస్ …జోష్ లో సిపిఐ…

Drukpadam

Leave a Comment