Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ట్రంప్ చర్యలపై ముప్పేట దాడి

ట్రంప్ చర్యలపై ముప్పేట దాడి
-పేస్ బుక్ ,ఇనిస్టాగ్రమ్ , ట్విట్టర్ ఖాతాల తొలగింపు
-బాగ్దాద్ కోర్ట్ నుంచి అరెస్ట్ వారంట్ జారీ
జనవరి 20 వ తారీఖు వరకు అమెరికా అధ్యక్షుడుగా కొనసాగనున్న డోనాల్డ్ ట్రంప్ చర్యలపై ముప్పేట దాడి జరుగుతుంది . తాజాగా పేస్ బుక్, ఇనిస్టాగ్రమ్ , ట్విట్టర్ ఖాతాల తొలగిస్తున్నట్లు దాని యజమాని జ్జుకార్ బర్గ్ ప్రకటించారు . గతంలో ఉన్న నిషేధాన్ని పొడగిస్తున్నట్లు ఆయన తెలిపారు . గత కొన్నేళ్లుగా ట్రంప్ ఎలాంటి పోస్టింగ్ లు పెట్టినా అడ్డుచెప్పలేదని , వివాస్పదంగా ఉన్నవాటిని , తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని మాత్రమే తొలిగించాం అని అన్నారు . ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజలలో చీలికలు తీసుకొచ్చేయిగా ఉన్నాయని తాము నమ్ముతున్నామని జుకర్ బర్గ్ పేర్కొన్నారు . జాతీయ వాదాన్ని రెచ్చగొట్టి హింసకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి . గతంలో ఏ అధ్యక్షుడు ఇలాంటి చర్యలకు పాల్పడలేదని అమెరికా వాసులే వాపోతున్నారు . బుధవారం అమెరికా లో జరిగిన సంఘటనలు ప్రపంచాన్ని నివ్వరపోయేలా చేశాయి . ట్రంప్ పిలుపు మేరకు వాషింగ్టన్ డిసి లోని క్యాపిటల్ భవనము పై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడి ప్రపంచమంతా చూసింది . అనధికారికంగా అధిన సమాచారం మేరకు పోలీసులు జరిపిన కాల్పులలో 4 మరణించారని తెలుస్తుంది . ఇది అమెరికా చరిత్రలో దుర్దినంగా పేర్కొంటున్నారు . ఇరాన్ ఆదేశ మిలిటరీ కమాండర్ ను డ్రోన్ సహాయంతో హత్య చేసిన సంఘటనపై బాగ్దాద్ కోర్ట్ ట్రంప్ కు అరెస్ట్ వారంట్ జారీచేసింది . ట్రంప్ పిలుపు మేరకు ఎన్నికైన ప్రథినిధుల ధ్రువీకరణ ప్రక్రియ జరుగుతున్నా కాపిటల్ భవనం లోని కాంగ్రెస్ వద్దకు చేరుకున్న వెలది మంది మద్దతు దారులు , నానాహంగామా సృస్టించారు . కాపిటల్ భవనాన్ని లోకి చొరబడి స్పీకర్ కార్యాలయం లో ఆయన కుర్చీ మీద కూర్చున్న ఫోటో లు వైరల్ అయ్యాయి . కిటికీలు , అద్దాలు పగల గొట్టారు . సమావేశం జరుగుతున్నా ప్రాంతం నుంచి సభ్యులను అండర్ గ్రౌండ్ లోని రహస్య మార్గం ద్వారా రక్షణ దళాలు బయటకు పంపాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు . గత నవంబర్ 3 న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లిక్ పార్టీ తరుపున పోటీచేసిన ట్రంప్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జోబిడెన్ చేతిలో ఓడిపోయారు . ఇది అంట ప్రజాస్వామ్య బద్దంగా ఆదేశ రాజ్యాంగం ప్రకారం జరిగిన ప్రక్రియ . కానీ దాన్ని ఆయన ఒప్పుకొటంలేదు . అధికారికంగా ప్రకటించినప్పటికీ తన ఓటమిని అంగీకరించని అధ్యక్షుడిగా ఆయన చరిత్ర లో నిలిచిపోయారు . చివరికి తమపార్టీ కే చెందిన స్పీకర్ ను తనుకు అనుకుంగా వ్యవహరించాలని కోరటం జుగుస్సాకరం . ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నాడని చెప్పుకుంటున్న అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఆయన వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . తన ఓటమిని హుందాతనంగా అంగీకరించి గెలుపొందిన వ్యక్తికి అధ్యక్ష భాద్యతలు అప్పగించి శహబాస్ అనిపించుకోవాల్సిన ట్రంప్ చరిత్రలో చెడ్డవాడిగా మిగిలిపోవటం ఒక మచ్చగానే ఉంటుంది .

Related posts

అవినాష్ మంచితనం గురించి తెలియాడనికి ఆయనేమైనా పుచ్చలపల్లి సుందరయ్య నా …బీటెక్ రవి

Drukpadam

వ్యాక్సిన్ పై ప్రధాని నిర్ణయం చారిత్రాత్మకం …పొంగులేటి సుధాకర్ రెడ్డి

Drukpadam

గులాబీ బాస్ మీటింగ్ … ఏమి చెబుతారోననే ఉత్కంఠ !

Drukpadam

Leave a Comment