Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కన్నా జానారెడ్డికి ప్రతిష్టాత్మకం

సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కన్నా జానారెడ్డికి ప్రతిష్టాత్మకం
నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని అధికారికంగా ప్రకటించింది . దీంతో కాంగ్రెస్ లో అభ్యర్థి విషయంలో శషభిషలకు తావులేకుండా చేసింది . ఈ ఎన్నిక కాంగ్రెస్జా కన్నా జానారెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారింది . ఆయనకు సాగర్ లో మంచి పట్టు ఉంది . గతంలో ఆయన అక్కడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు . తెలంగాణ మొదటి శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు . మాటకు కట్టుబడి, ముక్కుసూటితంగా వ్యవహరించే నాయకుడిగా ఆయనకీ మంచి పేరుంది . అందుకే బీజేపీ పార్టీ నుంచి మంచి ఆఫర్లు ఉన్నా ఆయన కాంగ్రెస్ లోనే ఉండి పోరాడి తన సత్తా చాటాలని అనుకున్నారు . జానారెడ్డి ఈసారి తాను కాకుండా తన కుమారుడిని బరిలో నిలపాలని భావించారు . అయితే రాష్ట్రము లో మారుతున్నా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈసీటు గెలవటం ద్వారా తమ సత్తా చాటాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది . అందుకే జానారెడ్డిని ఒప్పించి మరి బరిలో నిలిపింది . రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకమైన స్తానం ఉన్న జానారెడ్డి తెలంగాణ ఏర్పాటులో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు . ఇటీవల ఆయన బీజేపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయనకు బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేశారని , ఆయన కుమారుడైన రఘువీర్ రెడ్డి కి నాగార్జునసాగర్ సీటు ఇస్తామన్నారని వార్తలు వచ్చాయి . అయినప్పటికీ ఆయన వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే తన చర్యల ద్వారా కాంగ్రెస్ తోనే తన ప్రయాణమని చెప్పకనే చెప్పారు . ఆయన పోటీలో ఉంటె టీ ఆర్ యస్ ,బీజేపీ లు పోటీలో ఉన్న జానారెడ్డినే వారికీ బలమైన అభ్యర్థి గా ఉంటారని పరిశీలకుల అభిప్రాయం . ఆయనకు ప్రజలతో మంచి సంభందాలు ఉండటంతో ఈ సరి పోటీ రసవత్తరంగా ఉండే ఆవకాశం ఉంది . కాంగ్రెస్ పార్టీ , టీపీసీసీ చీఫ్ ఎంపిక కూడా వాయిదా వేసిన నేపథ్యం లో ఇక కొద్దీ కాలం పాటు విరామం ఇంచినట్లు అయింది . కాంగ్రెస్ నేతలంతా నాగార్జున సాగర్ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది . రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ సాగర్ ఎన్నికలలో రాష్ట్ర నాయకులను ఏకతాటిపై నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం . సాగర్ లో గెలుపు రాష్ట్ర రాజకీయాలలో మలుపు కానున్నదని కాంగ్రెస్ నేతల విశ్వాసం . టీ ఆర్ యస్ పై ప్రజల భ్రమలు తొలిగిపోయాని అందుకే దుబ్బాకలోను , గ్రేటర్ ఎన్నికలలోను టీ ఆర్ యస్ ను ప్రజలు తిరస్కరించారని అయితే అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి అడ్వాంటేజ్ అయిందని , కానీ రాష్ట్రము లో బీజేపీ ప్రభావం వారు అనుకున్నంత ఉండకపోవచ్చునని కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది . బీజేపీ కూడా సాగర్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకొంటుంది . సమర్థమైన అభ్యర్థి అన్వేషణలో ఆపార్టీ ఉంది . కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆర్ధిక బలం పుష్కలంగా ఉంది. రాష్ట్రము లో అధికారంలో ఉన్న టీ ఆర్ యస్ తమ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకాల మరణము చెందినందున తిరిగి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని పట్టుదలతో ఉంది . ఒకవేళ ఇక్కడ టీ ఆర్ యస్ ఓడిపోతే ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో ఉన్న టీ ఆర్ యస్ సీటు నిలబెట్టుకునేందుకు సర్వ శక్తులు వడ్డే ఆవకాశం ఉంది . దీంతో సాగర్ ఉపఎన్నిక జానారెడ్డి రాజకీయ భవిషత్ తోపాటు రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపు కానున్నదనటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు .

Related posts

పదేళ్ల కిందట అవినీతిలో పోటీ ఉండేది.. గత ప్రభుత్వాలపై ప్రధాని విమర్శలు!

Drukpadam

ట్యాంక్‌ బండ్ పై వైఎస్ షర్మిల అరెస్ట్.. మౌన దీక్ష భగ్నం…

Drukpadam

బండి సంజయ్ ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు ప్రజా వంచన యాత్ర :కేటీఆర్ ఫైర్!

Drukpadam

Leave a Comment