Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో బండి సంజయ్ హాట్ కామెంట్స్

ఖమ్మం లో బండి సంజయ్ హాట్ కామెంట్స్

#కెసిఆర్ ప్రభ్యత్వం కూలిపోవటం ఖాయం
#పోరాడి సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లో బందీ అయింది
#ఖమ్మం జిల్లా మంత్రి అజయ్ భరతం పడతాం-ఆయన జైలుకు వెళ్లడం ఖాయం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఎక్కడకు వెళ్లిన ఎదో ఒక హాట్ కామెంట్ చేయటం సంచలనంగా మారింది . శుక్రవారం ఖమ్మం లో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ ఛుగ్ కలిసి పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు . బీజేపీ శ్రేణులు వారికీ ఘానా స్వాగతం పలికాయి . వారి పర్యటన ఆసాంతం రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలతో సాగింది . రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పైన , జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ మీద చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి . రాష్ట్ర ప్రభుత్వం పూర్తీ కాలం లేకుండానే పడిపోతుందని జోశ్యం చెప్పారు . ముఖ్యమంత్రి అవినీతిని కక్కిస్తామన్నారు. రాష్ట్రము లో అవినీతి , మూర్ఖత్వపాలన సాగుతుందన్నారు . రాష్ట్రానికి కెసిఆర్ అనే వాస్తు దోషం పట్టిందన్నారు . పోరాడి సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లో బందీ అయిందన్నారు . దేశంలో కరోనా వ్యాక్సిన్ కనుగొన్నట్లు గానే తెలంగాణాలో కరప్షన్ కు వ్యాక్సిన్ కనిపెట్టమని దుబ్బాకలో , గ్రేటర్ హైదరాబాద్ లో అది పని చేసిందని అన్నారు . కెసిఆర్ మంత్రి వర్గంలో పవర్ లేని మంత్రులు ఉన్నారని ఒక్కడికి కూడా స్వంతగా నిర్ణయం తీసుకునే సత్తాలేదన్నారు . జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ పై సీరియస్ ఆరోపణలు చేశారు . బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారని , ఆయన ఎన్నికోట్లు ఇచ్చి మంత్రి పదవి తెచుకున్నారో అందరికి తెలుసున్నారు . ఆయన భరతం పడతామన్నారు . సిద్ధాంతాలు గురించి మాట్లాడే అర్హత అసలు అజయ్ కి లేదన్నారు . నాలుగు పార్టీలు మారిన మంత్రి బీజేపీ పై అవాకులు , చవాకులు పెళుతున్నాడని తన కబ్జా భూములను కాపాడుకునేందుకే టీ ఆర్ యస్ లో చేరారని ధ్వజం వెత్తారు . తన తండ్రిని అడ్డం పెట్టుకొని బతుకుతున్న అజయ్ అవినీతి పై విచారణ జరిపిస్తామని 93 , 94 సర్వే నెంబర్లలో కబ్జా భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు . ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు . రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఖమ్మం మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరటం ఖాయం అన్నారు . అధికారులు మంత్రి అడుగులకు మడుగులొత్తటం కాకుండా నిస్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు . రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్ని విషయాలను గుర్తు పెట్టుకొని వడ్డీతో సహా తీరుస్తామన్నారు . తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన మేధావి వర్గం రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించకపోటం బాధాకరం అన్నారు . సంజయ్ పర్యటన బీజేపీ కార్యకటాలలో మంచి జోష్ నింపింది .

Related posts

యువతితో హోటల్ రూమ్ లో కేంద్ర మాజీ మంత్రి… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. 

Drukpadam

తెలుగువాడ్ని అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ

Drukpadam

‘మహా’ సర్కారు కుప్పకూలడం ఖాయమేనా?గంటగంటకు మారుతున్న పరిణామాలు !

Drukpadam

Leave a Comment