Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పట్టు -బెట్టు

పట్టు -బెట్టు
ఏపీ లో ఎన్నికల సంఘం , రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి యుద్ధం
సుప్రీంను ఆశ్రయించనున్న రాష్ట్ర ప్రభుత్వం
కోవిద్ వ్యాక్సిన్ ఉన్నందున ప్రసుతం ఎన్నికలు సాధ్యం కాదని వాదన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం పట్టు -బెట్టులాగా మారింది . ఈ వివాదం అధికార వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి , ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పోరులాగా మారిన విషయం తెలిసిందే . గత మార్చ్ లో జరగాల్సిన ఎన్నికలను కోవిద్ నేపథ్యం లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరికీ చెప్పాపెట్టకుండా వేశారు . అప్పుడు ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ జరిగి అనేక స్థానాలలో ఏకగ్రీవాలు అయ్యాయి . మరో రెండు మూడు రోజులలో ఎన్నికల జరగాల్సి ఉండగా , నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా వాయిదా వేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి . దీనిపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించి కొత్త కమిషనర్ గా రిటైర్డ్ హై కోర్ట్ న్యాయమూర్తి కానగరాజు ను నియమించింది . దీనిపై రమేష్ కుమార్ తన పదవీకాలం మూడుసంవత్సరాల కాలం ఉంటుందని దానిని మార్చే హక్కు ప్రభుత్వానికి లేదని హై కోర్ట్ ను ఆశ్రయించారు . దీనిపై హై కోర్ట్ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు నిచ్చింది . రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రమేష్ కుమార్ ను నియమించక తప్పలేదు . రమేష్ కుమార్ చంద్రబాబు నాయిడు నియమించిన వ్యక్తి కనుక తెలుగు దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు తెలుగు దేశం కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి , అంతే కాకుండా రమేష్ సామజిక వర్గం , చంద్రబాబు సామాజికవర్గం ఒకటే అయినందున రాష్ట్ర ప్రభ్యత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించడం పెద్ద దుమారాన్ని రేపింది . ఒక రకంగా చెప్పాలంటే రమేష్ కుమార్ , రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారని , సీఎం జగన్ పై కూడా వ్యక్తి గత ఆరోపణలతో కేంద్ర హోమ్ మంత్రి కి లేఖ రాయడం మరో వివాదానికి దారి తీసింది . ఆలేఖ తెలుగు దేశం ఆఫీసునుంచి రాయటం జరిగిందని తెలుగు దేశం సలహామేరకు రమేష్ కుమార్ నడుచుకుంటున్నారని ఆయన ఉన్నత కాలం ఎన్నికలు జరపటం కుదరదని అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది . తాను మార్చ్ లో రిటైర్ అవుతున్నందున ఈలోపునే ఎన్నికలు జరిపి తీరాలనే పట్టుదలతో రమేష్ కుమార్ ఉన్నారు . ఆయన ఉండగా ఎన్నికలు జరపకూడదని రాష్ట్ర ప్రభుత్వం , ఇద్దరి పంతాలు పట్టింపులు కోర్ట్ జోక్యాలు , రకరకాల వాదనలు , రాజకీయ పార్టీల విమర్శలు ,ఎన్నికలపై ప్రక్రియ గందరగోళంగా మారింది , తిరిగి కోర్ట్ ను ఆశ్రయించిన ఎన్నికల కమిషనర్ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు . దీనిపై కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులను ఎన్నికల కమిషనర్ తో మాట్లాడేందుకు పంపించి ఎన్నికలు జరిగేందుకు సంప్రదింపులు జరపాలని ఆదేశించింది . దీంతో చీఫ్ సెక్రటరీ తో సహా ముగ్గురు సీనియర్ అధికారులు కమిషనర్ దగ్గరకు స్వయంగా వెళ్లి ప్రభుత్వ ఆలోచనలను వివరించారు . కోవిద్ వ్యాక్సిన్ వేసేందుకు వేర్పాట్లు జరుగుతున్నందున ఎన్నికలు జరిపేందుకు ఆరునెలల నుంచి ఎనిమిది నెలలవరకు సాధ్యం కాదని తేల్చి చెప్పారు . అయినప్పటికీ రమేష్ కుమార్ మాత్రం తన పట్టును విడవకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చేర్చిన గంటకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి సంచలనం సృష్టించారు . దీంతో ఖంగు తిన్న రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ నిర్ణయం పై సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించేందుకు సిద్దపడింది . రాష్ట్ర అధికార యంత్రాంగం సహకరించ కుండా ఎన్నికలు జరపటం సాధ్యం కాదు . కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఎన్నికలు నిర్వ హించాలనే పట్టుదల ఎందుకో అర్థం కాకుండా ఉండనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . చట్టాలలో ఎలా ఉన్నా సహజ న్యాయ సూత్రాలు కొన్ని యుంటాయి . అన్నిటికన్ని పౌర చట్టం చాల గొప్పది . అసలే కోవిద్ కారణంగా ఇబ్బదులు పడుతున్న ప్రజలకు హాని జరగకుండా ఇటు కమిషనర్ కానీ , రాష్ట్ర ప్రభుత్వం గని వ్యవహరించటం మంచిది …. తిరిగి బాలు సుప్రీం కోర్ట్ పరిధిలో కి వెళ్లినందున ఏమి జరుగుతుందో చూడాల్సిందే !!!

Related posts

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: శశిథరూర్…

Drukpadam

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ!

Drukpadam

శశికళ ఈజ్ బ్యాక్.. తమిళనాడు అంతటా పర్యటిస్తానని ప్రకటన!

Drukpadam

Leave a Comment