Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మళ్ళీ కోర్ట్ మెట్లు ఎక్కిన ఏపీ స్థానిక ఎన్నికలు

మళ్ళీ కోర్ట్ మెట్లు ఎక్కిన ఏపీ స్థానిక ఎన్నికలు
ఏపీ స్థానిక సంస్థలు ఎన్నికల పై జరుగుతున్న రచ్చ హైకోర్ట్ మెట్లు ఎక్కింది . ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ,రాష్ట్ర ప్రభ్యత్వ అభిప్రాయాలను పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహణకు నోటిఫికేషన్ ఇవ్వటంతో రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ ను ఆశ్రయించింది .దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ,రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంప్రదింపుల ప్రక్రియను అపహాస్యం చేశారని మండిపడింది .మొండిగా రమేష్ కుమార్ ముందుకు వెళ్ళితే ఎన్నికల విధులను భవిస్కరిస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి
.కరోనా వేళ ఎన్నికలకు తొందరెందుకని ప్రశ్నించాయి .ఎన్నికల సంఘ ఇంటా బయట వ్యవహార శైలిపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .
కోర్ట్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పారు . స్వయంగా చీఫ్ సెక్రటరీ , మరో ఇద్దరు సెక్రటరీ స్థాయి అధికారులు ఆయన వద్దకు వెళ్లి ,రాష్ట్రంలో కరోనా పరిస్థితులు , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలను గురించి గంటన్నరకు పైగా వివరించారు . రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాగం అంతా కోవిద్ మహమ్మారి విధులలో ఉన్నారని , దానికి సంభందించిన వ్యాక్సిన్ కూడా ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రభుత్వ అధికారులు యస్ ఇ సి కి వివరించినా వారి అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా వ్యవహరించిన తీరు గర్హనీయం అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . నిస్పక్షపాతంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు భిన్నంగా వ్యవహరించటం పై తెలుగు దేశంతో సహ ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేసుస్తుండగా ,ప్రభుత్వం మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతుంది . స్థానిక సంస్థల ఎన్నికలు కొద్దికాలం పాటు విడుద వేసినంత మాత్రాన వచ్చేనష్టం ఏమిలేదని రాష్ట్ర ప్రభుత్వం తో పాటు ఉద్యోగ సంఘాలు , వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయం పడుతుండగా ,కొందరు మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు . అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నామినేషన్ల ప్రక్రియ పూర్తీ అయి మరో రెండు మూడు రోజులలో ఎన్నికలు జరగనందగా ఇదే రమేష్ కుమార్ ఎన్నికలను కోవిద్ కారణం చూపి వావిదా వేసిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు . ఎన్నికల సంఘం రాష్ట్రప్రభుత్వం పరస్పరం సహకారం తో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను రాజకీయం చేయటం ఏమాత్రం సమర్థనీయం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . రమేష్ కుమార్ మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకునే విధంగా వ్యవహరించటం లేదని , తన పై వచ్చిన విమర్శలను నిజం చేసేవిధంగా వెళుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి .

Related posts

ప్రజలంతా నిస్సంకోచంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవచ్చు: అమిత్ షా!

Drukpadam

శరద్ పవార్ వెన్నుపోటుదారన్న శివసేన నేత గీతే.. జాతీయ నేతగా అభివర్ణించిన సంజయ్ రౌత్!

Drukpadam

మోడీకి మమతాబెనర్జీ గుడ్ సర్టిఫికెట్ …

Drukpadam

Leave a Comment