Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రైల్వే సిబ్బందికి కరోనా ఎఫెక్ట్ …ఇప్పటివరకు మొత్తం 2,400 మంది మృతి…

రైల్వే సిబ్బందికి కరోనా ఎఫెక్ట్ …ఇప్పటివరకు మొత్తం 2,400 మంది మృతి
-రైల్వే లో మొత్తం సిబ్బంది 12 లక్షలు -7 .5 లక్షలమందికి టీకాలు
-రైల్వేలో రోజుకు 150 మందికి కరోనా..
-కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు రైల్వే ఆసుపత్రులలో సదుపాయాల పెంపు
-దేశ వ్యాప్తంగా 889 రైళ్లతో సేవలు 479 ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడి
-రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ

భారతీయ రైల్వేలో రోజుకు 150 మంది ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారని రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సునీత్ శర్మ తెలిపారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. రైల్వేలోని 12 లక్షల మంది సిబ్బందిలో 7.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు.

అలాగే, ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 2,400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. కాబట్టి రైల్వే ఉద్యోగులను ప్రాధాన్య జాబితాలో చేర్చి టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు చెప్పారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైల్వే ఆసుపత్రులలో వెంటిలేటర్లు, పడకలు పెంచడంతోపాటు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా నెలకొల్పినట్టు తెలిపారు.
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ తయారీలోనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కరోనా ఆంక్షల వల్ల రైళ్లను పూర్తిస్థాయిలో నడపలేకపోతున్నామని , ప్రస్తుతం దేశవ్యాప్తంగా 889 ప్రత్యేక రైళ్లు, 479 ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్టు సునీత్ శర్మ తెలిపారు.

Related posts

బిల్కిస్ బానో దోషుల విడుదలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్… !

Drukpadam

రష్యా సింగిల్‌ డోసు స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 79.4 శాతం!

Drukpadam

వర్క్‌ ఫ్రమ్‌ హోంపై మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం!

Drukpadam

Leave a Comment