Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్​ రెడ్డి ట్వీట్​ పై మంత్రి జగదీశ్​ రెడ్డి మండిపాటు…

రేవంత్​ రెడ్డి ట్వీట్​ పై మంత్రి జగదీశ్​ రెడ్డి మండిపాటు…
-చెత్త మనుషులకు చెత్త ఆలోచనలే వస్తాయని కామెంట్
-వాటిపై స్పందించబోనన్న మంత్రి
-జగదీశ్ కుమారుడి బర్త్ డే వేడుకలపై రేవంత్ వ్యంగ్య ట్వీట్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు . తనను ఉద్దేశిస్తూ రేవంత్ చేసిన వ్యంగ్య ట్వీట్ పై మండిపడ్డారు. చెత్త మనుషులకు చెత్త ఆలోచనలే వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు మాట్లాడిన విషయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు.

అసలు కథ ఏమిటంటే కర్ణాటక లోని హంపిలో మంత్రి జగదీష్ రెడ్డి కుమారుడి బర్త్ డే వేడుక దుమాదంగా జరిగిందని దానికి పలువురు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యులు హాజరయ్యారని ఒక పత్రిక కథనం …. ఆ వేడుకల్లో రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయని ,అందులో పాల్గొన్న నాయకులూ అప్పటికే ఈటల మాట్లాడుతున్న మాటలను సమర్థించటమే కాకుండా , కేటీఆర్ ముఖ్యమంత్రిగా జరుగుతున్న ప్రచారం పై కూడా మాట్లాడుకున్నారని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై మంత్రి ఘాటుగా స్పందించారు.

ట్విట్టర్ లో ఏముంది

పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ట్వీట్ చేసిన రేవంత్.. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’.. కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా? అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనే మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగదీశ్ రెడ్డి కుమారుడి పుట్టిన రోజు వేడుకలను హంపిలో జరిపినట్టు, ఆ వేడుకలకు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనలపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అందులో పేర్కొంది. ఇప్పటికే ఈటలపై వేటు పడడంతో.. తర్వాతి వేటు పడేది జగదీశేనా? అన్న కోణంలో వార్తను ప్రచురించింది.

కొన్ని మీడియా ఛానళ్లలో కూడా రేవంత్ ట్విట్ పై జగదీష్ రెడ్డి స్పందనపై కథనాలు వచ్చాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హల్చల్ నడిచింది.

 

 

Related posts

జగన్, పొంగులేటి భేటీ …వ్యాపారమా …? రాజకీయమా …??

Drukpadam

మాజీ సీఎం యడియూరప్పకు బీజేపీ షాక్..

Drukpadam

అమిత్ షా కు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రసంశలు …

Drukpadam

Leave a Comment