Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ మరో షాక్ … మాజీ కేంద్రమంత్రి జితిన్ ప్రసాద్ గుడ్ బై ,బీజేపీ లో చేరిక…

కాంగ్రెస్ మరో షాక్ … మాజీ కేంద్రమంత్రి జితిన్ ప్రసాద్ గుడ్ బై ,బీజేపీ లో చేరిక
-గ్రూప్ ఆఫ్ 23 మందిలో జితిన్ ప్రసాద ఒకరు ….
-మరికొంత మంది పార్టీని వీడే అవకాశం
కాంగ్రెస్ పార్టీకి షాక్ లమీద షాక్ లు తగులుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కీలక నేత ,మాజీ కేంద్రమంత్రి , జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు . ఆయన కేంద్ర రైల్వే మంత్రి , బీజేపీ సీనియర్ నాయకులూ పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఉత్తర ప్రదేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జితిన్ ప్రసాద్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం పెద్ద నష్టమేనని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. ఆయనకు బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ అసమ్మతివాదులుగా ముద్రపడిన గ్రూప్ ఆఫ్ 23 మందిలో జితిన్ ఒకరు కావడం విశేషం … ఈ 23 మంది కాంగ్రెస్ పార్టీ లో వ్యవస్థాగతమైన మార్పులు జరగాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.
జితిన్ ప్రసాద బీజేపీ లో చేరికను యూ పి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు… యూ పి లో జితిన్ చేరిక బీజేపీ విజయావకాశాలను మరింత మెరుగు పరుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం జితిన్ ప్రసాద్ కాంగ్రెస్ ను వీడినంత మాత్రాన జరిగే నష్టమేమి లేదని చెప్పింది. ఆయన ఇప్పటికే పార్టీ కార్యాలపాలకు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతగా ముద్రపడ్డ ఆయన బీజేపీ లో 2019 నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు జితిన్ అత్యంత సన్నిహితుడు … ఇద్దరు డూన్ స్కూల్ విద్యార్థులే … యూత్ కాంగ్రెస్ లో కూడా కలిసి పని చేశారు. ఆయన సొంత పట్టణమైన షాజాన్పూర్ లో ఎస్పీ నేత ఒకరు కాంగ్రెస్ లో చేరారు . అక్కడ కొత్తగా వచ్చిన ఆయనకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని జితిన్ ఆరోపణ .

Related posts

ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు దేశంలో ఉన్నాడా?: కేటీఆర్‌

Drukpadam

ప‌నిచేసే వారికే పార్టీ టికెట్లు… కాంగ్రెస్ నేత‌ల‌కు తేల్చిచెప్పిన రాహుల్!

Drukpadam

రెండవ ప్రాధాన్యతలో కోదండరాం కు స్వల్ప ఆధిక్యం

Drukpadam

Leave a Comment