Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేపు జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ కానున్న సీఎం!

రేపు జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ కానున్న సీఎం!
రెండు రోజుల క్రితమే వెళ్లాల్సి ఉండగా పర్యటన రద్దు
తాజాగా అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు సమాచారం
షా సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది. నిజానికి రెండు రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో వెళ్లలేకపోయారు. తాజాగా ఆయన అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే, కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఆదుకోవాలని జగన్ ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రేపటి జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ స్పందన మరోలా ఉంది. ఆయన కేసులకోసమే ఢిల్లీ వెళుతున్నారని ఆరోపణలు గుప్పిస్తుంది. తనకు ఇబ్బంది ఉన్న ప్రతిసారి ఢిల్లీ వెళ్లి ప్రధాని ,హోమ్ మంత్రిని కలిసి వేసుకుంటారని రాష్ట్రానికి మేలు కోసం కాకుండా తనమేలు చూసుకుంటారని విమర్శలు చేస్తుంది. ..

Related posts

సీఎం జగన్ ,టీడీపీ నేత అచ్చన్న మధ్య ఆశక్తికర సంభాషణ ….

Drukpadam

పేర్ని నాని-ఎంపీ బాలశౌరి వివాదంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్..

Drukpadam

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్: శరద్ పవార్ విమర్శలు

Drukpadam

Leave a Comment